
1-CHILLARA DEVULLU - 120
₹120
In stock · 633 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
డా॥ దాశరథి రంగాచార్య సాహిత్యం తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామ దశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ అస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు చేసిందీ చివరకు భూమికోసం, భుక్తికోసం, భాషకోసం, వెట్టిచాకిరి అంతంకోసం, నిజాం పాలనను తుదముట్టించటంకోసం ఎలా సంఘటించి పోరాడిందీ 'దాశరథి రంగాచార్య రచనలు' నేటి తరానికి కళ్ళ ముందు కదలాడేలా చేస్తాయి. చిల్లరదేవుళ్ళు, మాయజలతారు, మొదుగుపూలు, జనపదం వంటి నవలలు - 'చరిత్ర నిర్మాతలు జనం' అన్న సత్యాన్ని వెల్లడిస్తాయి. వీరి రచనలు జనం భాషలో గుండెలను పలకరిస్తూ, మెదళ్ళకు పదనుబెడ్తాయి. అనేకం ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. కొన్ని చలన చిత్రాలుగా కూడా వచ్చాయి. సంప్రదాయం పునాదుల మీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం దాశరథి రంగాచార్య సాహిత్యం.