1 - GANTEDA GOWRUNAIDU SAHITYAM - KATHALU by GANTEDA KIRAN Telugu book cover

1 - GANTEDA GOWRUNAIDU SAHITYAM - KATHALU

by GANTEDA KIRAN

₹350
In stock · 8 available
PublisherGANTEDA KIRAN
LanguageTelugu
మా మాట - స్నేహకళాసాహితి గంటేడ గౌరునాయుడు మాష్టారి కథల సమగ్రం ఒక పుస్తకంగా ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాం అని వివరణ ఇవ్వబోవడానికి ఈ మాట రాయడం లేదు కానీ ఒక రచయిత సుదీర్ఘ ప్రయాణాన్నీ..... ఆ ప్రయాణంలో ఒక సాహితీ సంస్థ పరిణామక్రమాన్నీ, ఈ రెండూ సమాజ గమనంలో పాలుపంచుకున్న స్థితినీ అంచనా వేసుకోవడం అవసరం అని భావిస్తున్నాం. ఇటీవలే అంటే గత యేడాది స్నేహకళా సాహితి సిల్వర్ జూబ్లీ సందర్భంగా "పొద్దు ములిగిపోయాక...." కథా సంకలనాన్ని తీసు కొచ్చింది. ఆ రోజే అనుకున్నాం ఇంత దూరం నడిచామా? అని. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని మైలు రాళ్ళో! కురుపాంలో మొదలయిన మా ప్రయాణం అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసుకోవడం, ప్రతి శనివారం ఒక కథని పరిచయం చేసుకోవడం, దాని పై చర్చించడం తో మొదలై ఈ రోజు ఇలా ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్తూ వుండడం ఆనందాన్నిస్తుంది. కథల మాష్టారు కాళీపట్నం రామారావు గారు కురుపాం వచ్చి లైబ్రరీ కోసం ఎన్నో పుస్తకాలిచ్చి వెళ్ళడం నిన్న లేదు మొన్ననే జరిగినట్టనిపిస్తూవుంది. వాడ్రేవు చినవీరభద్రుడు గారు రెండు రోజుల క్రితమే కురుపాం సభలో మాట్లాడి వెళ్ళినట్టనిపిస్తూ వుంది. ఈ దారిలో కొత్త తరాన్ని ఏర్పర్చుకుంది. చింతా అప్పల్నాయుడు, సిరికి స్వామినాయుడు, మల్లిపురం జగదీశ్, పక్కి రవీంద్రనాథ్, చందనపల్లి గోపాలరావు, పల్ల రోహిణీ కుమార్ లాంటి కవులూ, కథారచయితల్నీ తయారు చేసుకుంది. సుమారు 20 పుస్తకాల్ని ప్రచురించింది. వీటిలో కథ, కవిత, వ్యాసం, గేయం మరియు పధ్యం లాంటి అన్ని సాహితీ ప్రక్రియల్నీ తడిమింది. ఈ ప్రయాణంలో గౌరునాయుడు మాష్టారి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మాష్టారి మొదటి కథల సంపుటి "ఏటిపాట” ప్రచురణ, స్నేహకళా సాహితి ప్రస్థానమూ సుమారు ఒకే సారి సంభవించింది. ఈ రోజు స్నేహకళాసాహితి గురించి మాట్లాడడమంటే గౌరునాయుడు గారి గురించి మాట్లాడ్డమే. ఆయన ఏమి చేసారు అనడానికి స్నేహకళాసాహితి సమాధానం అయితే, అతని కథ ఏమి మాట్లాడింది అనడానికి ఈ కథల సమగ్రం అని భావిస్తున్నాం. -గంటేడ గౌరునాయుడు కథలు