
1-GNANA CHANDRIKA BALA SAHITYAM
₹45
In stock · 93 available
PublisherMADDA SATYANARAYANA
LanguageTelugu
మున్నుడి అక్షరం న క్షతి న క్షీయతి! యీ నానుడి నన్నావేశించి ఆదేశించింది! మానవుడై పుట్టుట కేవలం గిట్టుటకు మాత్రం కాదు. గిట్టిన అనంతరం జీవించుటకు అని. క్షరము (నాశము)కానిది, క్షయము లేనిది అక్షరము అనగా (syllable). అట్టి అక్షర సత్యాలను పసివారి డెందాలకందించాలనే మహత్తరాశయం, బాలల సాహిత్యంపై కృషి చేయడానికి దోహదం చేసింది. అందుకే విశ్వశ్రేయః కావ్యం అనే నన్నయగారి ఆజ్ఞకు బద్ధుడనై ఈ కావ్యాన్ని తెలుగు లోకానికి అందించాలని అవిరళ కృషి చేసాను. దీనికి అనేక కోణాలనుండి ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. సాహిత్య పరంగా, సమాజ పరంగా, ఆర్థికపరంగా, కుటుంబ బాధ్యతల పరంగా మరియు వృత్తిపరంగా! కాని అనుకొన్నది సాధించటం మానవ లక్ష్యం! అది నా లక్ష్యం! అందుకే ఈ చిన్ని పుస్తకాన్ని మీ ముందు ఉంచుతున్నాను. పిల్లలకు తేలికగా అవగాహన కావాలనే సదుద్దేశ్యంతో కొన్నిచోట్ల పద్యములందు విసంధులు చేసాను. ఇందులకు సహృదయ కవి, పండితులను ఆన్యధా భావించవద్దని ప్రత్యేకముగా మనవి చేసికొంటున్నాను. జ్ఞానచంద్రిక -2 : సామెతల సత్యవేదం, పద్యకావ్యం, (వ్యాఖ్యాన సహితం)- ఈ యేడాది విడుదలైన తరుణంలో చాలమంది సాహితీ మిత్రులు మొదటి భాగం కావాలని ప్రస్తావించిన కారణంగా, వారి ఆశను నిరాశపర్చలేక ఆర్థికంగా కష్టమైనప్పటికి 3వ ముద్రణ చేస్తున్నాను. యీమధ్య వ్రాసిన మరిన్ని పొడుపు కథలనుకూడా జతచేసాను. ఈ పొడుపుకథలు ఛందోబద్ధమైన పద్యాలతో విద్యార్థులకు విజ్ఞానదాయకంగా, ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.