1 - GNANA VYAVASTA SAMACHARA PRAKRIYEEKARANA PUNARUDDARANA by VELAGA MANAVENDRA Telugu book cover

1 - GNANA VYAVASTA SAMACHARA PRAKRIYEEKARANA PUNARUDDARANA

by VELAGA MANAVENDRA

₹90
In stock · 8 available
PublisherVELAGA MANAVENDRA
LanguageTelugu
ముందుమాట ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాల డిగ్రీ స్థాయి కోర్సు BLISc ఉమ్మడి ప్రణాళిక అనుసరించి పాఠ్యాంశ అధ్యయన భాగాలు రాయటం జరిగినది. విద్యార్థిని, విద్యార్థులకు Exam point of view లో తెలుగులో అత్యంత సులభశైలిలో రూపొందించబడినది. ప్రతి అధ్యాయం సారాంశం స్పష్టంగా చెప్పే ప్రయత్నంలో తగు చిత్రాలు, పట్టికలు ఏర్పాటు చేసి సంతృప్తికరంగా వివరించే ప్రయత్నం జరిగినది. ఈ పుస్తక పేపరు "జ్ఞానవ్యవస్థ, సమాచార ప్రక్రియీకరణ పునరుద్ధరణ-1" గ్రంథాలయ శాస్త్రంలో అపార అనుభవాన్ని గడించిన పలువురి సూచనలు, సలహాలను అనుసరించి అత్యంత ప్రామాణికంగా రూపొందించటం జరిగినది. ఈ పుస్తకం గ్రంథాలయ నిర్వహణ సిబ్బందికి తమ శాస్త్రంపై విషయ పరిశీలనకు ఉపయుక్తకరంగా ఉంటుంది. ప్రధాన పరీక్ష కోసం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించే నిమిత్తం ఒక మంచి విద్యార్థి తనకు తానుగా స్వయంగా, స్వయంకృషితో ఐదు, ఆరు నెలలు శ్రమించి ఒక మంచి నోట్సు తయారుచేసుకొని పరీక్షకు ఎలా సిద్ధం అవుతాడో, అదే విధంగా ఈ నోట్సుని ముద్రణ రూపంలో మీ ముందు యధాతథంగా ఉంచడం జరిగినది. ప్రతి అధ్యాయంలో వుండే సాధారణ, వృధా అనవసర అంశాలను ప్రక్కన పెట్టి ప్రధాన పరీక్షలో ఏ అంశాలు రాస్తే అత్యధిక మార్కులు వస్తాయో, ఆ అంశాలను మాత్రమే మరింత సమగ్రమైన, సులభరీతిలో ఈ పుస్తకంలో అందించే ప్రయత్నం చేయటం జరిగినది. ఈ పుస్తక ముద్రణకు తమ వంతు ప్రోత్సాహ, సహకారాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ వివిధ విశ్వవిద్యాలయ గ్రంథాలయశాస్త్ర బోధన సిబ్బందికి నా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. ఈ పుస్తకంలో ఏదైనా లోపాలు గమనించి నట్లయితే రచయిత దృష్టికి తీసుకురాగలరు. మలిముద్రణలో సవరించి ఈ గ్రంధం మరో పదిమంది విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపే నిమిత్త మరింత పటిష్టంగా ఉపయుక్తంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయటం జరుగుతుంది.