1- HITHOPADESA KATHALU - PILLALA BOMMALA by SWATHI BOOK HOUSE Telugu book cover

1- HITHOPADESA KATHALU - PILLALA BOMMALA

by SWATHI BOOK HOUSE

₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812065
రాజుగారి విచారం... మనదేశంలోని అతి ప్రాచీన పట్టణాలలో “పాటలీపుత్రం" ఒకటి. ఒకానొకప్పుడు పాటలీపుత్రాన్ని సుదర్శనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు కుమారులు చదువు గురించి పట్టించుకొనేవారు కాదు. ఎప్పుడూ ఆటపాటలతో కాలం గడుపుతూ ఉండేవారు. ఆ రాజు ఒకరోజు రెండు శ్లోకాలు విన్నాడు. వాటి అర్థం ఇది. “శాస్త్రం అన్నది మూడవ కన్నులాంటిది. ఎన్నో సందేహాలను తొలగిస్తుంది. కంటికి కనిపించని దానిని కనిపింపజేస్తుంది. శాస్త్రం చదవనివాడు గుడ్డివానితో సమానం. యవ్వనం, ధనం, రాజ్యాధికారం, అవివేకం అనేవి అనర్థాన్ని కలిగిస్తాయి. ఆ నాలుగూ కలిస్తే కలిగే కీడును అంచనా వేయలేము.” ఆ శ్లోకాలు విన్న రాజుకు తన కుమారులు జ్ఞాపకం వచ్చారు. వారు శాస్త్రం నేర్వలేదు. ఎప్పుడూ చెడుదారిన వెళ్ళుతూ ఉన్నారు. వారి గురించి ఆయనకు విచారం పట్టుకుంది. వెంటనే తన ఆస్థానంలోని పండితులను సమావేశపరిచాడు "నా పుత్రులకు శాస్త్రజ్ఞానం లేదు. ఎప్పుడూ చెడుదారిలో తిరుగుతున్నారు. వారికి నీతి శాస్త్రాన్ని బోధించి విద్యావంతులుగా తీర్చిదిద్దమని కోరుతున్నాను”. అని పండితులను కోరాడు. రాజు మాటలకు విష్ణుశర్మ రాజ కుమారులను తీర్చిదిద్దుతానని ముందుకు వచ్చాడు. ఒక రోజు విష్ణుశర్మ రాజ కుమారులను తన దగ్గరకు పిలిపించుకుని "రాజకుమారులారా! శ్రద్ధగా వినండి. బుద్ధి మంతులైన వారు కావ్యాలను, శాస్త్రాలనుగూర్చి చర్చిస్తారు. దాని వలన లభించే వినోదంతో ఆనందంగా కాలం గడుపుతారు. మూర్ఖులు ఎప్పుడూ నిద్ర పోవడం, తగవులాడటం, మధ్యపానం చేయటం వంటి చెడు అలవాట్లతో కాలం గడుపుతారు. మీకు మిత్రుల వలన కలిగే లాభాల గురించి చెబుతాను వినండి" అని అన్నాడు. రాజకుమారులు కుతూహలంగా చెప్పమని అడిగారు. విష్ణుశవర్మ ఆ కథలను చెప్పడం మొదలు పెట్టాడు.