1-SARATH SAHITHYAM DEVADASU by SARATH CHANDRA CHATARJI Telugu book cover

1-SARATH SAHITHYAM DEVADASU

by SARATH CHANDRA CHATARJI

₹45
In stock · 109 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
దేవదాసు సమయంలో వైశాఖ చూపంలో ఒకనాటి మధ్యాహ్నం, ఎందమహా తీవ్రంగా ఉంది. అంతులేనంత తాపంగాకూడా ఉంది. సరీగ్గా ఆ సమయంలో ముఖర్జీలవారి దేవలను ఊరి వీధిబడిలో ఒక మూల చిరుగుల చాపమీద కూర్చుని, పలకచేత పుచ్చుకుని, కళ్ళుతెరుస్తూ కళ్ళుతెరుస్తూ మూస్తూ, కాళ్ళు కాళ్లు బారచాచుకుని ఆవలిస్తూ చివరకు పాఠాత్తుగా ఏదో మహ ఆలోచనలోపడిపోయాడు. ఇంత చక్కని సమం గాలిపటం ఎగరవేసుకొని పొలాలమీద తిరగటానికి బదులు బళ్ళో కట్టిపడేసినట్లు. కూచోవటం మంచిదికాదని ఒక్క నిమిషంలో తేల్చుకున్నాడు. అతడి తెలివైన బుర్రలో 4. ఒక ఉపాయంకూడా మొలకెత్తింది. అతడిహ పలకచేత్తో పుచ్చుకుని లేచి నిలబడ్డాడు. మధ్యాహ్నం భోజనాలకి బడివదిలి పెట్టారు. పిల్లలంతా గోలచేస్తూ దగ్గిరలో ఉన్న మర్రిచెట్టుకింద చేరి ఆడుకుంటున్నారు. దేవదాసు అటుకేసి చూశాదొకసారి. మధ్యాహ్నం పూట అందరినీ విడిచి పెట్టినా దేవదాసునుమాత్రం విడిచిపెట్టరు. 15 ఎందుచేత అంటే ఒకసారి బడి విడిచిపెట్టి బైటికివెళ్ళాడంటే మళ్ళీ రావటానికి దేవదాసుకు ఏ మాత్రం ఇష్టం ఉండదని గోవిందవంతులు అనుభవంమీద తెలుసుకున్నాడు. దేవదాసు తండ్రి ఆంక్షకూడా ఉంది పంపవద్దని. ఇలాంటి అనేక కారణాలవల్ల అతడు ఈ సమయంలో బడికి 'మానేటర్' అయిన 'భోలా కస్టడీ'లో ఉండాలని నియమం ఏర్పాటయింది బళ్ళో ఇప్పుడు వంతులుగారు ఒక్కరూ మధ్యాహ్నపు బదలికవల్ల కళ్ళు మూసుకుని పడుకొన్నారు. భోలా కూడా ఒకమూల చేతులూకాళ్ళూ ముడుచుకొని ఒక విరిగిపోయిన బెంచీమీద చిన్న పంతులు ఠీవితో కూర్చుని, మధ్య మధ్య అతి నిర్లక్ష్యంగా ఒక్కొక్కసారి పిల్లల ఆటలు చూస్తున్నాడు. ఒకోసారి పార్వతీ దేవదాసులకేసి ఒకదృష్టి పారేసి ఉంచుతున్నాడు. పార్వతి పంతులుగారి ఆజ్ఞలోకివచ్చి ఒక నెల్లాళ్ళయింది. ఈ కొద్ది రోజుల్లోనే పంతులుగారు బహుశః ఆ అమ్మాయి మనస్సును రంజింపచేసి ఉంటారు. అందుచేతనే పార్వతి ఏకాగ్రమైన మనస్సుతోనూ, అతిధైర్యంతోనూ నిద్దరోతున్న పంతులుగారి ఆకారాన్ని బాలశిక్ష చివరిపేజీమీద సిరాతో చిత్రిస్తూ, మధ్య మధ్య మహా నేర్పువున్న చిత్రకారిణిలాగా తాను అతి శ్రద్ధగా వేసిన ఈ చిత్రం తను అనుకున్నట్లు వచ్చిందా లేదా అని