_Front-display.webp)
1-VELURI SIVARAMA SASTRY KATHALU
₹200
In stock · 84 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నకల్ హైదరాబాద్ జాగీరు చిన్నది. జాగీరుదారు దాని కన్న చిన్నవాడు! జాగీరు పేరు బూవంచ, జాగీరుదారు పేరు మురాద్, బవంచ చుట్టును మైలు రెండుమైళ్ల లోపలనున్న వన్నియు యూనియన్ గ్రామములు. బూవంచ నడుముగా బోవు దారిమీద శాయర్ గుడిసె ఒకటి ఉన్నది. దానిముందు వస్త్రాపహరణ ధనాపహరణములుకాని మొనగాడింతవర కెవడును లేదు. నిజాం సంస్థానమున రజాకార్లు రాజ్యము చేయుట మొదలిడిన పిదప బజ్జు సాహెబు మురాద్లలో కొన్ని అభిప్రాయములను బలవంతముగా విత్తెను. అవి అంకురించెను. దానికి ఫలముగా బూపంచ హైదరాబా దాయెను, మురాద్ నిజామాయెను: బజ్జు రజ్వీ అయెను. పటేల్ పట్వారీలు పోలీసులుగను మిగిలినవారందరును రజాకార్లుగను మార్చి. గ్రామమునగల సుమారువేయి గడపలో ఎనుబదివందల గడప ఒక నూరుగడపకు గజగజ లాడిపోవలసివచ్చెను. అటులయ్యు తన సంఖ్యాబలమును చూచుకొని ఆ యెనుబది వందల గడపయు దైర్యము చిక్కబట్టుకొని యుండెను. ఇటులుండగా ఒకనాడు గ్రామము నట్టనడుమ గప్పాల దిబ్బమీద కాంగ్రెసు జెండా రెపరెపలాడుచు సుదూరము కనబడెను. దివాణమున ఆలోచన లారంభమాయెను. 'దీనిని పాతిన కాఫిర్ ఎవడు?" అని రజాక్ అనెను. అరే పార్థకాక మరెవరు? అని పీర్ అనెను. ఈమాటలు వినుచు మురాద్ మీసాలు మెలిపెట్టుచు జెండాకేసి క్రోధముగా చూచుచుండెను. అప్పుడు బజ్జు చేతులూపుచు - 'భాయీ' మీసాలు మెలిపెట్టి క్రోధముతో జూడగా 'ఆ ఝండా ఏల పడలేదా?' యని మన నవాబుగా రాలోచించుచున్నటులున్నారు. ఇది సత్యకాలమా? ఇది క్రియాకాలము! కాబట్టి వారి యిచ్ఛ యేల కొనసాగదో చూచుట మన వంతు, ఈ ఝండా కూల్చుటయే మనపని కాదు. 'బందరులో పోయిపడదు' మనియే రజ్వీ యనెను. మరి మనమొక అగ్రహారముదాటి యింకను ఆవలికిపోయి. పడుదుమో లేక ఎక్కడికిపోయి పడుదుమో అది మనకే తెలియదు. 'ఆసఫ్ జాహి ఝండాను ఢిల్లీకోటమీద పాతుదు' మని మాత్రమే రజ్వియనెను. మనమో మహాఘనత వహించిన