
100 HASYA KATHALU - 70
₹70
In stock · 3 available
PublisherPRATHIBHA PUBLICATIONS
LanguageTelugu
మళ్ళీ మళ్ళీ నవ్వండి! తెలుగు పాఠకులలో నసిరుద్దీన్ గురించి ఆయన కథల గురించి తెలియనివారు వుండరేమో! ఇప్పటికే మార్కెట్లో నసిరుద్దీన్ కథల పుస్తకాలు పాఠకులు చాలానే చూసి వుంటారు. అయినా మంచి హాస్యం, వివేకం, యుక్తి, చమత్కారంగల నాణ్యమైన 100 కథలను ఎంపిక చేసి “100హాస్య కథలు” పేరుతో తెలుగు పాఠకులకు అందిస్తున్నాను. నసిరుద్దీన్ మన తెలుగువారి పరోపకారి పాపన్నలా, మర్యాద రామన్నలా, తెనాలి రామకృష్ణుడులా, బీర్బల్ మహామేధావి, దయార్ద్ర హృదయుడు. నసిరుద్దీన్ కు రాజులన్నా, ధనవంతులన్నా అసహ్యం. అలాగే పిసినారులను, ఆశపోతులను, లంచగొండి అధికారులను ఆటపట్టిస్తుంటాడు. అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాడు. పేదలపట్ల అపారమైన ప్రేమ, వారి కష్టాలు, సమస్యలు తన సమస్యలుగా/కష్టాలుగా భావించి తనకు చేతనైన సాయాన్ని చేసేందుకు ముందుంటాడు. వారి కథల్లో హాస్యం, వివేకం, యుక్తి, చమత్కారం పుష్కలం. అందుకే ఎన్నిసార్లు చదివినా ఈ కథల్ని మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తాయి. చదివాక మళ్ళీ మళ్ళీ నవ్వాలనిపిస్తాయి. "నవ్వు మన ఆరోగ్యానికి నాలుగు విధాల మంచిదన్నారు వైద్యులు. అందుకే ఈ హాస్య కథల్ని చదివి మళ్ళీ మళ్ళీ నవ్వుకుందాం. ఈ సందర్భంగా మీకు ఈ 100 కథల్ని వంద రూపాయలలోపు వెలకు (అంటే ఒకో కథ రూపాయిలోపు ధరకే) అందిస్తున్న "ప్రతిభ పబ్లికేషన్స్" వారికి నావైపు నుండి, మీవైపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కథలు నూతన అక్షరాస్యులకు, బాల పాఠకులకు, వయోజనులకు వివేకాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని ఇస్తూ ఆనందింపజేస్తాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలతో చదివిస్తే వారిలో సృజనా శక్తి, తెలివి పెరిగి మనోవికాసం కలుగుతుంది.