
101 SCIENCE PRAYOGALU - 130.00
₹130
In stock · 704 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. ఒకే పువ్వుకి సగం రంగు కావలసినవి: 1. రెండు గాజు గ్లాసులు 2. నీరు 3. ఎరుపు రంగు 4. తెల్లని పువ్వు పూసిన ఒక మొక్క 5. కాడను చీల్చేందుకు బ్లేడు రెండు గాజు గ్లాసులు తీసుకోవాలి. వాటిని కొంచెం వెలితిగా నీటితో నింపాలి. ఒక గ్లాసులోని నీటిలో ఆహార పదార్థాలలో కలుపుకునే ఎరుపు రంగు కొద్దిగా వేయాలి. దీని వల్ల ఈ గ్లాసులోని నీరు ఎరుపుగా తయారవుతుంది. తెల్లని పువ్వు పూసిన ఒక మొక్కను ఎన్నుకొన్ని, పువ్వును కాడతో సహా తెంపాలి. పువ్వు కాడను జాగ్రత్తగా రెండు చీలికలుగా చేయాలి. బొమ్మలో చూపిన విధంగా కాడ ఒక చీలికను ఒక గ్లాసు నీటిలోను, రెండవ చీలికను ఎరుపు రంగు ఐరు గల రెండవ గ్లాసులోను ఉంచాలి. ఈ విధంగా అమరికను కొన్ని గంటలపాటు ఉంచాలి. ఇప్పుడు పువ్వులో ఒక భాగం ఎర్రగాను మరొక భాగం తెల్లగాను కనిపిస్తుంది. పువ్వులోకి కాండం ద్వారా జల రవాణా జరిగింది. ఎరుపు రంగు నీరు పువ్వులోకి వెళ్ళడంవల్ల అటువైపు పువ్వు భాగం ఎరుపు గులోకి మారింది.