116 MAHARSHULA DIVYA CHARITRALU by BHAMIDIPATI BALATRIPURA SUNDARI Telugu book cover

116 MAHARSHULA DIVYA CHARITRALU

by BHAMIDIPATI BALATRIPURA SUNDARI

₹110
In stock · 3 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ముందుమాట పిల్లలూ! ఈ పుస్తకం ప్రత్యేకంగా మీ గురించే మొదలుపెట్టాను. ఎందుకో తెలుసా ? మీరు అమ్మకడుపులోంచి బయటికి వచ్చాక ఆడుకునేందుకు కూడ లేకుండ బడికి వెళ్లిపోతున్నారు. ఇంక చదువులు మొదలూ....... అసలు చదువుకీ, విద్యకీ తేడా తెలియదు కదూ ! చదువు బ్రతుకు తెరువుకి, తినడానికి, బట్ట కట్టడానికి, ఉండడానికి ఒక గూడు కోసం, కాని విద్య ఉంది చూశారూ... అది జ్ఞానాన్ని ఇస్తుంది. బ్రతకడం నేర్పుతుంది, మనం మనకోసం, మనం ఇతరుల కోసం బ్రతకడం కూడా నేర్పిస్తుంది. పెద్దలంటే భక్తి, వినయం, దైవభక్తి అన్ని సుగుణాల్ని నేర్పుతుంది. మనంట వచ్చే జన్మకి పెట్టుబడి ఈ జన్మలోనే పెట్టాలిట. చూడండీ.... మనం అవయవాలు లేకుండా గానీ జబ్బులతో గానీ పుట్టామనుకోండి ఏమనుకుంటాం? పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో ఈ జన్మలో ఇలా పుట్టాను, అనుకుంటాం కదా! అందుకే మంచి పన్లు చేస్తూ, న్యాయంగా, ధర్మంగా ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. అది మనకి క్లాసు పుస్తకాల వల్ల రాదు. మంచి మంచి పుస్తకాలు పెద్దవాళ్ళు మనకోసం రాసి పెట్టారు కదా ! అవి చదవడం మొదలు పెడ్తా వస్తుంది. మనం పుట్టక ముందు ఈ భూమి మీద ఎంతో మంది గొప్పవాళ్ళు పుట్టేశారు కదా ! వాళ్లందరూ ఎలా ఉన్నారో తెలుసుకొని మనం కూడా అలాగే గొప్పగా ఉండాలంటే మంచి పుస్తకాలు చదవాలన్నమాట. ఇలాంటి మంచి పుస్తకాలు చదవడం వలన మనం చూడలేకపోయిన చాలామంది గురించి చాలా విషయాల గురించి తెలుసుకోగలుగుతాం. అంతేకాదు... మనం దొరల చదువులు చదివేస్తున్నాం కదా! మన తెలుగు భాష మనకి కాకుండాపోతోంది. మిగతా భాషలు మనకి ఎక్కడికైనా వెళ్ళినపుడు బ్రతకడానికి, ఉద్యోగాలకి ఉపయోగపడతాయి. మాతృభాష ఉంది చూశారూ... దీన్ని మనం వదలకూడదు. మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే మనం బాగా చదువుకుని ఉద్యోగానికి వెళ్ళాక అమ్మని వదిలేస్తున్నామా...? ఇంత పెద్ద అవడానికి ఎవరు కారణం... అమ్మ! అమ్మ అంటే మనకి ఎంత గౌరవమో, ఎంత మర్యాదో మాతృభాష మీద కూడా అంతే ఉండాలి.