
1857 MANAM MARACHINA MAHA YUDDAM - 200
by M.V.R.SASTRY
₹200
In stock · 1 available
PublisherDURGA PUBLICATIONS
LanguageTelugu
ముందుగా ఒకమాట మనది చిత్రమైన జాతి. భూప్రపంచం మొత్తంమీద మరెక్కడా కానరాని వింత మనస్తత్వం మనది. మనది గొప్ప చరిత్ర, గొప్ప సంస్కృతి, గొప్ప పరాక్రమం గల ప్రాచీన జాతి. ఆ సంగతి ఒప్పుకోవడానికి మనకు మనసొప్పదు. లేదా పబ్లిగ్గా పైకి అనడానికి గొంతు పెగలదు. కొన్ని వేల, కనీసం కొన్ని వందల సంవత్సరాలుగా మన దేశవాసులు శ్రీరాముడిని ఆదర్శ పురుషుడుగా, మహావీరుడుగా తలచి, ఇలవేల్పుగా కొలుస్తున్నారని తెలుసు. ఐనా రాముడు మనకు జాతీయ వీరుడని అంగీకరించాలంటే మేధావులమైన మనం ఆముదం తాగినట్టు ముఖం పెడతాం. కురుక్షేత్రంలో క్రీ.పూ. 31,38 ప్రాంతాల్లో భారత యుద్ధం జరిగిందనడానికి బలమైన రుజువులున్నాయని తెలుసు. సముద్రగర్భంలో కలిసిన ద్వారకానగరం ఉపగ్రహం ద్వారా శాస్త్రీయ పరిశోధనలో బయటపడిందనీ, పురాణాల్లో చెప్పిన వివరాలకు, ఈ కాలపు సైన్సు కనుగొన్నది ఇంచుమించుగా సరిపోతున్నదనీ తెలుసు. ఐనా భారత యుద్ధంలో కీలకపాత్ర వహించిన ద్వారకా ప్రభువు శ్రీకృష్ణుడిని చారిత్రక వ్యక్తిగా కాక కల్పిత పాత్ర అని పెద్దమనుషుల మధ్య చెప్పుకోవడానికే సైన్సును కొలిచే మనం ఇష్టపడతాం. దేశమంతటా ఊరూరా గుడి కట్టించుకుని వేల సంవత్సరాలుగా ప్రజల పూజలందుకుంటున్న రాముడికీ, కృష్ణుడికే దిక్కులేనప్పుడు ఇటీవలి శతాబ్దాల్లో రాణకెక్కిన రాణాప్రతాప్, శివాజీల్లాంటి 'చిల్లర తిరుగుబాటుదారుల' సంగతి చెప్పనే అక్కర్లేదు. నూరు, నూట యాభై ఏళ్ల కింద దేశంకోసం పోరాడి, ప్రాణాలర్పించిన వేలూ, లక్షల 'అరాజక, అభివృద్ధి నిరోధక, అనాగరిక' శాల్తీల గురించి గుర్తుచేసుకోకపోవడమే మంచిది. "మేర లేని మత మౌఢ్యంలో, బ్రాహ్మణ విష సంస్కృతి భ్రష్టాచారాలతో కునారిల్లి అజ్ఞానాంధకారంలో వేల సంవత్సరాలు కొట్టుమిట్టాడిన మన దిక్కుమాలిన దేశానికి విజ్ఞాన ఖనులూ, నాగరికతా వైతాళికులూ అయిన తెల్లదొరలు ఎడమకాలు మోపడంతో ఎట్టకేలకు మంచిరోజులు వచ్చాయి.