
2-AMERICA ILLALI MUCCHATLU
₹200
In stock · 9 available
PublisherVANGURI FOUNDATION OF AMERICA
LanguageTelugu
నన్ను 'గురువు గారూ' అని ఎల్లవేళలా సంబోధిస్తూ తన రచనా శైలిని విశిష్టంగా తీర్చిదిద్దుకున్న ఆత్మీయురాలు శ్యామలాదేవి దశిక. రోజూ జరిగే సంఘటనలని మనతో మాట్లాడుతున్నట్టే కథగా అల్లి అందరినీ ఆకట్టుకునే ఆమె అమెరికా ఇల్లాలే. 40 ఏళ్లుగా న్యూజెర్సీలో నివసిస్తూ భర్త రామకృష్ణ పేరు చెప్పకుండా 'ఆయనని' అడ్డం పెట్టుకుని తను చెప్పదలచుకున్న విషయాలు ముచ్చట్ల రూపంలోనూ, మరికొన్ని కథలుగానూ సరదాగా చదివించే రచయిత్రి శ్యామలాదేవి దశిక. ఐదేళ్ళ క్రితం ప్రచురించిన ఆవిడ తొలి పుస్తకం 'అమెరికా ఇల్లాలి ముచ్చట్లు' ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ పొందింది. అదే తరహాలో ధారావాహికలా మరికొన్ని ముచ్చట్లు, కథలూ కలిపి ఈ 'అమెరికా ఇల్లాలి ముచ్చట్లు -2' ఇప్పుడు మా 61వ ప్రచురణగా తెలుగు పాఠకులకి అందించడం మాకు ఆనందదాయకం, గర్వకారణం కూడాను. ఇందులో రచనలు చాలా మటుకు, సుజన రంజని, కౌముది, ఈ మాట, తెలుగు జ్యోతి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ లండన్ వారి సావనీర్ మొదలైన పత్రికల్లో ప్రచురించబడ్డాయి. కొన్ని అముద్రితాలు. తన రెండో పుస్తకం ప్రచురణకి కూడా మాకు అవకాశం ఇచ్చి, అన్ని విధాలుగానూ తమ సహాయ, సహకారాలని అందజేసిన శ్యామలా దేవి రామకృష్ణ దంపతులకి మా ధన్యవాదాలు. శ్యామలాదేవి రచనలని ప్రచురించి ప్రోత్సహించి, అడిగిన వెంటనే తమ ముందు మాటలని వ్రాసి ఇచ్చిన సుజన రంజని పూర్వ సంపాదకులు తల్లాప్రగడ రావు, సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గార్లకి మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు. హైదరాబాద్ డిశంబర్, 2015లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన ఉత్సవానికి ఈ అరుదైన అమెరికా హాస్యకథాసంపుటి పాఠకులకి అందజేస్తే బావుంటుంది అని సూచించి, డీటీపీ, పుస్తక రూప కల్పన, ముద్రణా బాధ్యతలని తనే తీసుకుని సమర్థవంతంగా పూర్తి చేసిన ఆత్మీయురాలు, సుప్రసిద్ధ రచయిత్రి,