2-HITHOPADESA KATHALU - PILLALA BOMMALA by SWATHI BOOK HOUSE Telugu book cover

2-HITHOPADESA KATHALU - PILLALA BOMMALA

by SWATHI BOOK HOUSE

₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812072
పాటలీపుత్రాన్ని పాలిస్తున్న సుదర్శనుడనే రాజు కుమారులను తీర్చిదిద్దడానికి విష్ణుశర్మ అనే పండితుడు ముందుకు వచ్చాడు రాజకుమారులకు మిత్రలాభం, మిత్రభేదం పేరిట పశు పక్ష్యాదులను పాత్రలుగా చేసి ఆయన కొన్ని కథలను వినిపించాడు. రాజకుమారులు వాటిని శ్రద్ధగా విన్నారు. ఆబోధనలో భాగంగానే విష్ణుశర్మ వారికి విగ్రహము, సంధి పేరిట మరికొన్ని నీతివంతమైన కథలను వినిపించి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాడు. విగ్రహము : ఘంటాకర్ణుడి కథ శ్రీ పర్వతం అనే కొండ మధ్యలో బ్రహ్మపురం అనే నగరం ఉంది. ఓ దొంగ అక్కడున్న ఒక గుడిలోని పెద్ద ఘంటను దొంగిలించాడు. అతడు భయపడి పరుగెత్తుతూ పోతూ ఉండగా దారిలో ఒక పెద్దపులి అతణ్ణి చంపి వేసింది. వాడి చేతిలోని ఘంట కోతులకు దొరికింది. ఆ ఘంటను కోతులు మ్రోగిస్తూ ఉండేవి. ఆ శబ్దం వింటున్న బ్రహ్మపురం ప్రజలు భయ బ్రాంతులకు లోనయ్యారు. పర్వతం మీద ఘంటాకర్ణుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు మనుషుల్ని తింటూ వుంటాడు, అని అనుకోసాగారు. దానితో ఆ నగరవాసులకు ఘంటాకర్ణుడి భయం పట్టుకుంది. ఆ నగరం రాజు ఘంటాకర్ణుడిని పట్టుకున్న వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఒక దాసి ముందుకు వచ్చింది. కొండపైకి వెళ్ళి ఘంట మ్రోగిస్తున్న కోతులను చూచింది. గంటను చేజిక్కుంచుకొని రాజు దగ్గరకు వెళ్ళి చూపించింది. ఆమె ధైర్యానికి మెచ్చుకొన్న రాజు ఆమెకు బహుమతులు ఇచ్చి సత్కరించాడు.