2-VELURI SIVARAMA SASTRY KATHALU by VELURI SIVARAMA SASTRY Telugu book cover

2-VELURI SIVARAMA SASTRY KATHALU

by VELURI SIVARAMA SASTRY

₹125
In stock · 397 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రౌఢా పరివ్రాజక వివాహము కొందఱ జన్మము ఉపోద్ఘాతము లేక వెలువడదు. తల్లిని లంచమిత్తురు కొందఱు ఆత్మసమర్పణ మొనరించుచు తల్లిని గూడ నర్పింతురు. మఱికొందఱు ఏదో చెప్పవచ్చి ఊరకున్నటులు చచ్చి ఊరకుందురు. ఇంకొందఱు తండ్రికిని, మేనమామకును పరలోకము నుండి జాబులు గొనివత్తురు. కసుఁగందులు కొంద ఱిటులు కొంతమందితో సంయోగ వియోగములు చేసి వారి ప్రయోజనము పలాములు చేయుదురు. ఇట్టి చిలిపి వారరుదు కారు. ఆశ. - గర్భములో పడినది మొదలు తన స్వత్వమును కేటాయించుకొనుచునే యుండెను. తాను గర్భమున జాగరిల్లి తల్లిని నిద్రింపఁజేసెను. తీఁగ చెట్టును వంచినట్లు తల్లిని వంచివేసెను. ప్రతిభాశాలుర కది స్వభావము, తుద కాశ జన్మించి తల్లిని దక్షిణ పుచ్చుకొనెను. ఆశకు తల్లిలేదు. గోవిందునకు భార్యలేదు. ఒక టైనను రెండుగా తోఁచు ఈ లోపము ఆశను ద్విగుణ ప్రేమతో పెంచెను. గోవిందుఁడు ఊయెల నూఁపుచు - 'ఆశ కిపుడుయ్యాలయే తల్లి' అనుకొనును, నడికిరేయి ఊఁపఁబోయి ఉయ్యాల త్రాళ్లను జూచి, 'తల్లి ఆకాశము నుండి చేతులు చాఁపుచున్నదా యేమి?' అని నివ్వెఱపడును. ఆశ ఆకాశమును జూచెనా, చైనా, అతఁడందు స్వర్గమును చూచెను. నవ్వెనా, ఆనందాభిషేక మొందెను. ఆశ అతని వాసనలు పెంపొందింప వచ్చిన ఉపకరణము. ఆశ బడిలో పడెను. అందు పంతుళ్లు ఇద్దఱు, మొదటి పంతుల కడ ఆశయొక్క చూపుడువేలు కొంత అఱిగెను. ఉన్న పిల్లలలో ఎవరి వెక్కువ అఱిగెనో ఆశ పరీక్షించును. పంతులవేలు ఏ పిల్ల వేలంతయు అఱుగకపోవుటచేత అతనితో "అలోకకు వచ్చినంత చదువు మీకు రాదు" అనును. హరిణ యింటికి వెళ్లి హరిణ తన తల్లిని అమ్మాయని పిలుచుట విని ఇంటికివచ్చి నాన్నా! హరిణ అమ్మ నాకు లేదేమని గోవిందునితో గోఁజాడును.