22 MAY HASHIMPURA by MALUPU BOOKS Telugu book cover

22 MAY HASHIMPURA

by MALUPU BOOKS

₹150
In stock · 9 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076190
ఢిల్లీ హైకోర్టు 2018 అక్టోబర్ 31న ఇచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పులో పదహారు మంది పోలీసు కానిస్టేబుళ్లకు హత్యానేరంపై యావజ్జీవ శిక్ష విధించింది. ప్రొవిన్షియల్ అర్మ్డ్ కాన్ స్టేబులరీ (పిఎసి)కి చెందిన ఆ పోలీసులు 1987 మే 22న మీరట్ శివార్లలోని హాషింపురాలో ముస్లిం యువకులను నిర్బంధించి, అందులో నలభై రెండు మందిని కాల్చి చంపారనేది ఆరోపణ. ఆ నేరాన్ని విచారించిన ఢిల్లీలోని తీస్ హజారీ సెషన్స్ కోర్టు 2015 మార్చ్ 21న తగిన సాక్ష్యాధారాలు లేవంటూ వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ తీర్పు హైకోర్టులో పునర్విచారణకు వచ్చింది. హత్యలు జరిగిన రోజున దిన కూలీలు, నేత పనివాళ్లు అయిన దాదాపు నలభై ఐదు మంది ముస్లిం యువకులను పిఎసి పోలీసులు ట్రక్కు ఎక్కించి ఘజియాబాద్ జిల్లా మురాద్నగర్లో ఎగువ గంగ కాలువ దగ్గర కాల్చి చంపి మృతదేహాలను కాలువలోకి తోసేశారు. చనిపోయినట్టు నటించి కాలువలో ఈదుతూ బైటపడిన ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు, పౌరహక్కుల సంఘాల ఒత్తిడి మీద హత్యాకాండ కేసు నమోదయింది. చార్జిషీట్ దాఖలు చేయడానికి పది సంవత్సరాలు, దాని మీద విచారణ కొనసాగించడానికి మరొక పది సంవత్సరాలు తాత్సారం చేసి, సుప్రీం కోర్టు జోక్యంతో విచారణ జరిపి, చివరికి హత్యాకాండ జరిగిన 28 ఏళ్లకు సెషన్స్ కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. కాని హత్యాకాండ జరిగినప్పుడు ఒక ఫొటో జర్నలిస్టు తీసిన ఫొటోలు హతుల నిర్బంధానికి, హత్యకు నిస్సందేహమైన ఆధారంగా ఉన్నాయని నిర్ధారించిన జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్లు పదహారు మంది పోలీసులకు యావజ్జీవ శిక్ష విధించారు. మరొక ముగ్గురు నిందితులు విచారణ క్రమంలో సహజ మరణంతో శిక్ష తప్పించుకున్నారు. ఈ దారుణ మారణకాండను సన్నిహితంగా పరిశీలించిన అప్పటి ఘజియాబాద్ పోలీసు సూపరింటెండెంట్, రచయిత విభూతి నారాయణాయ్ నవలా రూపంలో వ్యక్తీకరించిన ఆగ్రహ ప్రకటన ఇది.