24 GANTALU - K.G KANNABIRAN ATHMA KATHATHMAKA SAMAJIKA CHITRAM by N.VENUGOPAL Telugu book cover

24 GANTALU - K.G KANNABIRAN ATHMA KATHATHMAKA SAMAJIKA CHITRAM

by N.VENUGOPAL

₹200
In stock · 1 available
PublisherDEVULAPALLI PUBLICATIONS
LanguageTelugu
ప్రారంభం దేనై ఆరు సంవత్సరాల జీవితంలో, అర్థ శతాబ్దానికి పైబడిన న్యాయవాద వృత్తిలో, చెనన్నో అనుభవాలు గడించాను. చిరస్మరణీయమైన జ్ఞాపకాలు, సమాజం గురించీ, మానవ సంబంధాల గురించీ, ఉద్యమాల గురించీ చెప్పదగిన విశేషాలు అనేకం ఇన్నాయి. కాని నా ఈ జీవిత కథను ఆత్మకథగా రాయాలని నేననుకోవడం లేదు. అనుభవించిన జీవితం గురించి రాసుకోవడం ఒక అలసట గొలిపే ప్రక్రియ. ఒక వ్యక్తిని రూపొందించిన ఘటనల గురించి ఆ వ్యక్తే గుర్తు తెచ్చుకోవడం కష్టసాధ్యమైన ప్రయత్నం. అందువల్ల నా జీవిత చరిత్ర వ్యక్తిగా నా సొంత గొడవగా ఉండగూడదని నేనొక వ్యక్తిగా, పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తగా, న్యాయవాదిగా, ప్రజాస్వామిక వాది తయారు కావడంలో నా చుట్టూ జరిగిన అనేకానేక ఘటనల ప్రభావం ఉంది. అనేకమందితో నా సంబంధాల వల్ల, నా సంభాషణల వల్ల, ఆదాన ప్రదానాల వల్ల నా వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. తెలుగునేల మీద నా జీవితం, ఈ ప్రాంతంలో జరిగిన సమరశీల, వామపక్ష జన్మమాల పట్ల నా ప్రతిస్పందనలు, న్యాయవాదిగా ఈ సమాజం నా నుంచి కోరిన సేవలు, ఉద్యమజీవుల హక్కులను పరిరక్షించేందుకు నేను చేసిన న్యాయపోరాటాలు, ఈ రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎక్కడ ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన జరిగినా నేనక్కడికి వెళ్ళే బాధితుల పక్షాన న్యాయపోరాటం సాగించాలని బాధితులు ప్రత్యేకంగానూ, సమాజం సాధారణంగానూ వ్యక్తం చేసిన ఆశలు-ఇవన్నీ నా వ్యక్తిత్వంలో భాగం. నా జీవితంలో విడదీయరాని భాగం. నా జీవితంలోని ఆ భాగాన్ని సమీక్షించుకోవడం, పునరావలోకనం చేయడం అవసరం. అంటే నా జీవిత కథ నేను ఏ సామాజిక పరిణామాలకు స్పందించానో సామాజిక పరిణామాల వివరణగా ఉండాలి. ఆ సామాజిక చరిత్రలో నేనెట్లా భాగమయ్యానో, పాలుపంచుకుంటూనే ఆ చరిత్రను నేనెట్లా చూశానో వివరించడానికే నా ఈ జీవిత కథ. అయితే న్యాయవాద వృత్తిలోకి, పౌరహక్కుల ఉద్యమంలోకీ నేను ఎలా ప్రవేశించానో వివరించడానికి నేపథ్యంగానైనా నా జీవితంలోని తొలిరోజుల గురించి చెప్పడం అవసరం. మా పూర్వీకులు తమిళులు. ఎన్నో శతాబ్దాల కింద నెల్లూరు చేరి అక్కడే స్థిరపడిన కుటుంబం మాది. మా నాన్న డా|| కె.జి. అయ్యంగార్ సికిందరాబాద్లోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (ప్రస్తుత గాంధీ) ఆస్పత్రిలో నేత్ర వైద్యుడిగా పని చేస్తుండేవాడు. అప్పుడు మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది గాని మా నాన్న రెండో పెళ్ళి చేసుకోవడంతో