25 PRADARSHANALU NATIKALU NATAKAM by ILLA MURALIDHARA RAO Telugu book cover

25 PRADARSHANALU NATIKALU NATAKAM

by ILLA MURALIDHARA RAO

₹50
In stock · 427 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400750
25 PRADARSANALU by ILLA MURALIDHARA RAO 'సరదా - సందేశం కలిస్తేనే రచన' అని నా నమ్మకం. పదవీ విరమణానంతరం ఖాళీగా గడిపెయ్యడం ఇష్టం లేకే పీజీ చేసి పీహెచ్ఎ లో జాయినయ్యానుకదా! సాయంత్రాలెందుకు వృధా చెయ్యాలని నాటక దర్శకత్వంలో పీజీ డిప్లమో కోసం ఏ.యూ. రంగస్థలవిభాగంలో చేరానా? నచ్చేసింది. చిన్నప్పటి నుంచీ నాన్నగారు నన్నెత్తుకుని తీసుకెళ్లి నాటకాలు చూపించడం వల్లనో, పదవతరగతి వేసవిసెలవులలో గ్రామదేవత పండుగకు తొలిసారి (కేవల ఉత్సాహం కొలదీ) చిన్న నాటిక రాసి, ప్రదర్శింపజేయడం వల్లనో, తెలుగుసాహిత్య పఠనాసక్తి చేతనో నాటకాలపై మక్కువ ఎక్కువైంది. తడబడో, పడిలేచో అడుగులంటూ వేస్తేనే కదా ముందుకెళ్లగలం? అందుకే'తప్పులొస్తే రానీ' అని తెగించాను. ప్రాజ్ఞులు చెప్పకపోతారా? దిద్దుకోకపోతానా? బాసుల కాఠిన్యం, సిబ్బంది ఇబ్బందులూ 'పిక్నిక్' నాటకంలో స్పృశించాను. అలాగే మూడు 'నాటికలూ' అంతర్లీనంగా ఏదో ఒక సందేశాన్నిస్తాయి. అన్ని ప్రక్రియలను అంటుకోవాలనే ఆశతో ఒక చిన్న 'ఏకాంకిక' పుట్టింది. ఆయా పాత్రల ప్రవర్తనపై పరిస్థితుల ప్రభావం గట్టిగా ఉంటుందని నమ్ముతూ, పౌరాణిక, సాంఘిక మరియు జీవంలేని వస్తువులను పాత్రలుగా ఏర్చి కూర్చి ఇరవై 'ఏకపాత్రాభినయాలు' రాశాను. రసజ్ఞులైన పాఠకులు నా యీ ప్రయత్నాన్ని మన్నించి ఆదరించగలరని నమ్ముతూ, విజ్ఞులైన పాఠకుల దీవెనలు, సూచనలు, సలహాలను ఆశిస్తూ ఇళ్ళ మురళీధరరావు