3 ABADDALU by D.M.HARIKISHAN Telugu book cover

3 ABADDALU

by D.M.HARIKISHAN

₹10
In stock · 1 available
PublisherD.M.HARIKISHAN
LanguageTelugu
హిందూ ముస్లిం - భాయ్ భాయ్ దుమ్ము లేపుకుంటూ పోలీస్ జీపొచ్చి ఊరి చివరి ఎస్సీ కాలనీలో ఆగింది. హెడ్ కానిస్టేబుల్ ఉత్సాహంగా కిందకి దిగి పోలీసుల్తో వీధిలోకి నడిచాడు. ఆశ్చర్యం. ఒక్కడూ కనబళ్ళేదు. తలుపులన్నీ తాళాలేసున్నాయి. మొగోళ్ళే కాదు ఆడోళ్ళు, పిల్లలు, ఆఖరికి ముసిలోళ్ళు గూడా లేరు. ఇండ్ల లోపలేమైనా దాచిపెట్టు కున్నారేమోనని కిటికీల్లోంచి లోపలికి తొంగి చూశారు. ఎవరూ కనబళ్ళేదు. హెడ్ కానిస్టేబుల్కి ఏమీ అర్థం కాలేదు. ఈ రోజు పొద్దున్నే వస్తామని ముందే చెప్పినా ఎవరూ లేరే... కొంపదీసి వూర్లో వాళ్ళు రాత్రికి రాత్రి దాడిగాని చేయలేదుగదా... ఆ ఊహ రాగానే ఒళ్ళు జలదరించింది. పరిసరాలన్నిట్నీ డేగ కళ్ళతో పరిశీలనగా చూశాడు. అటువంటి ఆనవాళ్ళేమీ కనబళ్ళేదు. తిరిగి జీపు కాడికొచ్చి వెదకమని పోలీసులను తలోదిక్కూ పంపించాడు. హెడ్ కానిస్టేబుల్ జీపులో కూచోని ఆలోచించసాగాడు. కిందట్రోజు సాయంత్రం జరిగిన మీటింగ్ గుర్తుకొచ్చింది. మాలోళ్ళను, మాదిగోళ్ళను అందర్నీ పిల్చుకొచ్చారు. ఎస్సై వాళ్ళందర్నీ చూస్తూ “చూడండి... మనుషులంతా ఒక్కటే. కులాలు, మతాలు ఎన్నున్నా దేవుడొక్కడే. అందరిలోనూ ప్రవహించే రక్తపు రంగొకటే. కానీ... మిమ్మల్ని అంటరానోళ్ళనీ, తక్కువ కులమోళ్ళనీ మూడు అబద్దాలు