A CENTURY OF AN EPIC TELUGU-ENGLISH CONVERSATIONS by VETERAN JOURNALIST ASSOCIATION book cover

A CENTURY OF AN EPIC TELUGU-ENGLISH CONVERSATIONS

by VETERAN JOURNALIST ASSOCIATION

₹150
In stock · 13 available
PublisherVETERAN JOURNALIST ASSOCIATION
LanguageEnglish
ఇంగ్లీష్ పుస్తకం గురించి తెలుగులో పరిచయం మూడు దశాబ్దాల క్రితం నాకు రేడియో మాస్కోలో ఉద్యోగం వచ్చింది. నేను నా కుటుంబాన్ని వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లాను. ఆ దేశంలో శాకాహారులకు భోజనానికి ఇబ్బంది అని ఎవరో చెప్పగా విని, కొన్ని నెలలకు సరిపడా ఉప్పూ కారాలు, తిండిసామానులు సూటుకేసుల పోపుగింజలు మొదలయిన నిండా సర్దుకుని పట్టుకు పోయాము. మాస్కో షెర్మితోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీషులో ఏమంటారో ఆ క్షణాన చప్పున గుర్తు రాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడతామనీ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసాను. ఘాటయిన ఇంగువ వాసన, వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి, అది వారనుకునే మాదక పదార్ధము కాదని రుజువు చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి బయలుదేరలిగాము. ఈ బాపతు మాలాంటి వాళ్ళు ఉంటారని దాసు కేశవరావు పంత్ గారు ఊహించే అంతకు డెబ్బయి ఏళ్ళకు పూర్వమే ఒక పుస్తకం రాశారు. 'ఇది జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఇంగ్లీషులో చక్కగా మాట్లాడగలుగుతారు' అని దానికిందనే ఓ ట్యాగ్ లైన్ కూడా వుంది. ఆంగ్లంలో పట్టు సాధించాలని కోరుకునే తెలుగువాళ్ళకు పనికొచ్చే చిన్న పుస్తకం అన్నమాట. ఈ పుస్తకం పేరు A vade Mecum. లాటిన్ పదం. చిన్ని పుస్తకం అని అనడం ఎందుకంటే, జేబులో పెట్టుకోవడానికి వీలైన గైడు లాంటిది అని తెలుగులో ఆ లాటిన్ పదానికి అర్ధం అని నిఘంటు చెబుతోంది. ఈ చిన్న పుస్తకం రాసింది చాలా పెద్ద మనిషి. పేరు దాసు కేశవరావు పంత్ గారు. తెలుగువాడే. ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో పరిచయం చేసే బాధ్యత నామీద పడింది. ఇలా రాయమని అడిగింది ఎవరో కాదు, పురుషులందు పుణ్య పురుషుడు వేరయా అనే సామెతకు తగిన సీనియర్ జర్నలిస్ట్ దాసు కేశవరావుగారు. కాదనడం నాకే కాదు, ఎవరికైనా కష్టం. ఈ దాసు కేశవ రావు గారి తాతగారే ఈ పుస్తక రచయిత దాసు కేశవరావు పంత్ గారు.