A.P RAJAKEEYALU SAMAJIKA VARGALA PRABHAVAM by KOMMINENI SRINIVASARAO Telugu book cover

A.P RAJAKEEYALU SAMAJIKA VARGALA PRABHAVAM

by KOMMINENI SRINIVASARAO

₹150
In stock · 3 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ANDHRA PRADESH RAJAKEEYALU SAMAJIKAVARGALA PRABHAVAM - by Kommineni Srinivasa Rao ONARY కృష్ణాజిల్లా గన్నవరంలో పుట్టి పెరిగిన కొమ్మినేని శ్రీనివాసరావు 1978లో జర్నలిజంలో ప్రవేశించి నలభై ఏళ్ళ సర్వీసును పూర్తి చేసుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎన్.టి.వి., టి.వి.5, సాక్షి టీవీలలో ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సాక్షిలో కన్సల్టింగ్ ఎడిటర్గా ఉన్నారు. అంతకు ముందు ఎన్.టి.వి.లో చీఫ్ ఎడిటర్ హోదాలో కె. ఎస్. ఆర్. లైవ్ షోని నిర్వహించేవారు. సాక్షిలో కూడా అదే పేరుతో ఉదయం షోని కొనసాగిస్తున్నారు. తొమ్మిదేళ్ళుగా ఒకే వ్యక్తి పేరుమీద లైవ్ షో ఉండడం ఒక ప్రత్యేకత కాగా, సాక్షి టీవీలో రెండేళ్ళపాటు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా షో నిర్వహించి రికార్డు నెలకొల్పారు. పలు రాజకీయ పుస్తకాలను ఆయన అందించారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు, తెలంగాణ ప్రజల తీర్పుతో పాటు ఏపిలో శాసనసభ, లోక్సభలకు ఎన్నికైన సభ్యుల సామాజిక విశ్లేషణతో కూడిన పుస్తకాన్ని రూపొందించారు. ముఖ్యమైన రచనలు రాష్ట్రంలో రాజకీయం (ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వ్యాసాలు) ఆంధ్రా టు అమెరికా, తాజా కలం (ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసాల సంకలనం) తెలుగు ప్రజాతీర్పు-1952 నుంచి 2009 వరకు పలు ఎడిషన్లు శాసనసభ చర్చల సరళి (మూడు సంపుటాలు) ప్రాంతీయ ఉద్యమాలు - పదవీ రాజకీయాలు సంభాషణ చతురుడు - రోశయ్య ఆంధ్ర ప్రజాతీర్పు 1952-2014 తెలంగాణ ప్రజాతీర్పు 1952-2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సూత్రధారులు - పాత్రధారులు రాజకీయ చదరంగంలో ఆంధ్రప్రదేశ్ - ఆంధ్ర నేతల చారిత్రక తప్పిదం ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల, లోక్సభ సభ్యుల సామాజిక విశ్లేషణ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004