A TO Z INVESTMENT GUIDE-300 by SWATHI BOOK HOUSE Telugu book cover

A TO Z INVESTMENT GUIDE-300

by SWATHI BOOK HOUSE

₹300
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812898
ముందు మాట మీలో చాలా మందికి పొదుపు చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, మంచి రాబడి అందుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచన ఉంటుంది. కాని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి అందుకోవచ్చో అనే విషయాలపై మాత్రం అవగాహన ఉండదు. దీనికి ముఖ్య కారణం అవగాహన, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడమే ఆర్థికంగా ఎదగాలంటే కేవలం శ్రమించడం వలన సాధ్యం కాదు. మీ సంపాదనను కాస్త తెలివి ఉపయోగించి మీ డబ్బే, డబ్బూ కోసం కష్టపడి సంపదను స్రుష్టించే విధంగా చేయాలి. దానికి ముందుగా మీకు కావలసినది ఆర్థిక అక్షరాస్యత. ఆర్థిక అక్షరాస్యత సాధించాలి అంటే మీరు ఆర్థిక విషయాల గురించి పూర్తీగా నేర్చుకోవాలి. మీరు లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏవిధంగా నేల స్వభావంపై పంట ఉత్పత్తి ఆధారపడి ఉంటుందో. అదేవిధంగా మీరు కష్టపడిన సంపాదించిన డబ్బును మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దానిపై మీ సంపదలో వృద్ధి ఆధారపడి ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించిన సంపాదనను సంపదగా ఏ విధంగా మార్చవచ్చో ఈ పుస్తకం తెలియచేస్తుంది. ఈ పుస్తకం ఒక వ్యక్తికి కావలసిన ఆర్థిక అక్షరాస్యతను సంపూర్ణంగా కలుగ చేస్తుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి? వేటిలో ఇన్వెస్టె చేస్తే ఎలాంటి రిస్కు ఉంటుంది. ఏ విధమైన రాబడి ఉంటుంది. వివిధ వయస్సుల వారు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో తెలియచేస్తుంది. ఈ ప్రపంచంలో ఏది కూడా ఉచితంగా రాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక వేళ ఉచితంగా ఎవరైనా తెలియచేసిన దానిలో సంపూర్ణత్వం మాత్రం ఉండదు. ఈ భూమి మీద అతి చౌకైన వస్తువు ఇతరులకు సలహా ఇవ్వడమే. అందువలన ఇతరుల సలహాల మీద ఆధారపడి ఏదైన పని మొదలు పెట్టే ముందు ముఖ్యంగా ఆర్ధిక విషయాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కొనడానికి వెచ్చించే కొద్ది మొత్తం అమౌంట్ మీ ఫైనాన్సియల్ ప్లానింగ్ ను మీరు ఈ పుస్తకాన్ని గణనీయంగా మార్చివేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.