AA RATHRI - SYED AYESHA SULTANA by SYED AYESHA SULTANA Telugu book cover

AA RATHRI - SYED AYESHA SULTANA

by SYED AYESHA SULTANA

₹100
In stock · 7 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
AA RAATHRI రాత్రి ఏడున్నర...మెడికల్ కాలేజీ హాస్టల్ వైపుకు నడుస్తున్న విష్వానీకి చెట్టు చాటున దాక్కుని ఎవరో తనని గమనిస్తున్నట్టు అన్పించింది. అక్కడ చీకటిగా ఉండటంతో మొబైల్ ఫోన్లో ఫ్లాష్ లైట్ వెలిగించి ఆ చెట్టు వైపు ఫోకస్ చేసింది. మెల్లగా ఎవరిదో తల బైటికొస్తూ కన్పించింది. ఆమె వూపిరి బిగబట్టి చూడసాగింది. మొదట జుట్టు... తర్వాత నుదురు... తర్వాత కళ్ళు... తల మొత్తం... విష్వాని పెద్దగా కేకలు పెడ్తూ, హాస్టల్ బిల్డింగ్ వైపు పరుగెత్తింది. “ఏమైందే...దెయ్యాన్ని చూసినట్టు ఎందుకలా అరిచావు?” విష్వాని వీపు చుట్టూ చేయి వేస్తూ అడిగింది రూమ్మేట్ భవ్య. “ఔను. దెయ్యాన్నే చూశాను." "జోకా? నేను దెయ్యాల్ని నమ్మనని నీకు తెల్సుగా. నువ్వూ నమ్మవుగా. నిజం చెప్పు. ఆ చెట్టు దగ్గర ఎవరు కన్పించారు? ఎందుకు భయపడ్డావు?” "అక్కడ నేను నాంచారి మొహాన్ని చూశాను.” "నాంచారిని చూశావా? ఏ నాంచారి?” “ఇంకెవరనుకున్నావు? మనకు వన్ ఇయర్ జూనియర్ నాంచారి." ఆ మాట వినగానే భవ్య చేతిలోని గ్లాస్ జారి గచ్చు నేలమీద పడి భళ్ళున పగిలిపోయింది. “నాంచారి చచ్చిపోయి అప్పుడే నాలుగేళ్ళు కావస్తోంది కదే. ఆ అమ్మాయి కన్పించడమేమిటి? నాన్సెన్స్.” "కానీ ఇందాక ఆ చెట్టు వెనుక నాంచారిని నేను చూసింది మాత్రం నిజం" అంది విష్వాని. సయ్యద్ ఆయేషా సుల్తానా రాసిన ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ నవల “ఆ రాత్రి...” పబ్లిషర్స్