
AADAVARIKI AADIVARAM SELAVU
₹140
In stock · 1 available
PublisherUNGUTURU SRILAKSHMI
LanguageTelugu
iii మనస్సుమాంజలి “ఆడవారికి ఆదివారం సెలవు" అనే ఈ పుస్తకానికి రచయిత్రి శ్రీమతి అరుగులూరి శ్రీలక్ష్మి నన్ను ముందుమాట వ్రాయమనగానే ఎలా వ్రాయాలా అని ఆలోచించాను. చించగా చించగా నాకు తోచిందేమిటంటే ఈ రెండు పేజీలూ కోణాలనుంచీ చూస్తూ వ్రాసి పూర్తి న్యాయం చేయగలనని. అందుకే నేను విప్పి వ్రాస్తున్నాను ఈ నమస్సుమాంజలి. నా మనస్సుమాంజలి. ఆవిడ ఇప్పటికే మంచి రచయిత్రిగా పేరు పొందిన వ్యక్తి. నేను కవయిత్రిగా గౌరవించే సాహితీవేత్త. రెండవది నేనెంతగానో ప్రేమించే మా అప్పయ్య. అందుకని ఈ రెండుకోణాలనుంచీ చూస్తూ, చూపిస్తూ నా ముందుమాట వ్రాస్తున్నాను. దాదాపు అర్థ శతాబ్ధం పైగా దేశ విదేశాల పత్రికలు ఎన్నిటిలోనో కథలు, వ్యాసాలు, ప్రముఖ వ్యక్తులతో ముఖాముఖి పరిచయాలు, కథా సమీక్షలూ మొదలైనవెన్నో వ్రాసి తెలుగు పాఠకులకు ఎంతో దగ్గరయిన రచయిత్రి మీ అందరికీ చిరపరిచయమే. ఇప్పటికి రచయిత్రి వ్రాసిన ఐదు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, రచయిత్రిలోని నీతి నిజాయితీ ఆమె రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూంటాయి. అవి జీవితపు విలువలని మరొక్కసారి మనకి గుర్తు చేస్తూంటాయి. ఆమె రచనల్లో కథల్లోని పాత్రలు వేలవిడిచి ఆకాశంలో సాము చేయవు. అక్కడ నృత్య ప్రదర్శనలివ్వవు. మనం నిత్యం చూసే మనుష్యులూ, సంఘటనలూ, వారి కష్టాలూ, సుఖాలూ కనిపిస్తాయి. ముఖ్యంగా మధ్య తరగతి మందహాసాలు కనిపిస్తాయి. కథల్లోని పాత్రలకు కూడా మనకిలానే రకరకాల సమస్యలు. అన్నీ నేల మీదే జరుగుతాయి. ఆకాశంలో