
AADI PARVAM-60
₹60
In stock · 74 available
PublisherSATISH CHANDAR
LanguageTelugu
సతీష్ చందర్ కవి, సంపాదకుడు, వ్యంగ్యరచయిత. ఎక్కడయినా దారి వేసుకుంటూ వెళ్తారు తప్ప, వేసిన దారిలో నడవరు. కవిత్వంలో ఒక బలమైన వాదానికి ప్రతినిథిగా నిలిచారు. పత్రికా సంపాదకుడిగా నేడు రాష్ట్రంలో వున్న రెండు ప్రముఖ దినపత్రికలకు జీవం పోశారు. వ్యంగ్యరచయితగా తెలుగు వచనరచనకు గౌరవం తెచ్చారు. ఆయన సంతకం లేక పోయినా సరే, ఆయన వాక్యాలను పోల్చుకోవచ్చు. చదవటం మొదలుపెట్టేంత వరకే పాఠకుడి వంతు. ఆ తర్వాత చివరి వరకూ ఆయన రచనే చదివించుకుంటుంది. నవ్విస్తారు. నవ్వేడిపిస్తారు. ఏడిపించినవ్విస్తారు. గుండెబరువెక్కిస్తారు. అంతలోనే తేలికపరుస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే -ఆయన అక్షర మాంత్రికుడు. Anthology of Poems AADI PARVAM By Satish Chandar నాకు ముక్కు మీద కోపం వున్నప్పుడో, నేను బెంగతో నిట్టూర్చినప్పుడో, కంటి కొసల్న నీటి బొట్లు తళుక్కు మన్నప్పుడో ఎలా వస్తుందో, కవిత్వం నాముందు వాలిపోతుంది. ఆమె పరామర్శకు చిహ్నాలే ‘పంచమ వేదం', 'నాన్న సైకిలు', 'పసుపు జాబిల్లి' కవితా సంకలనాలు. ఇప్పుడు కోపం, బెంగా, దుఃఖం కలగలిసిపోయాయి. ఆమె నన్ను వదలనన్నది . ఫలితమే ఈ 'ఆది పర్వం'