AAGAMA ASIRVACHANA GADHYAM by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

AAGAMA ASIRVACHANA GADHYAM

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹120
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
ఈ పుస్తకం ఎందుకు? మనకంటే వయస్సులోనూ, చదువులోనూ పెద్దలైన వారికి నమస్కరించి, వారి ఆశీస్సులు తీసుకుంటే శుభం కలుగుతుందని మన విశ్వాసం. పెద్దలకు నమస్కరించగానే 'కలకాలం చల్లగా ఉండు' అని ఆశీర్వదిస్తారు. కొద్దిగా సంస్కృతం తెలిసినవారైతే 'దీర్ఘాయుష్మాన్ భవ!' వంటి మాటలను పలుకుతారు. మన నమస్కారాలను అందుకుని, సంతోషించిన పెద్దల మనస్ఫూర్తిగా అందించిన దీవెనలే మనకు రక్ష. మనం ఆలయంలో భగవంతునికి నమస్కరిస్తాం. అర్చనలు, అభిషేకాలు నిర్వహించి దైవానికి ప్రీతి కలిగేలా నడుచుకుంటాం. కల్యాణాలు, ఉత్సవాలు జరిపిస్తాం. మరి మనకు దైవమిచ్చే ఆశీర్వచనం ఏమిటి? ఆయన అనుగ్రహం సంపూర్ణంగా వర్షించిందని ఎలా తెలుసుకోగలం?! అనే ప్రశ్నకు సమాధానమే ఈ పుస్తకం. మన కోరికలను భగవంతునికి నివేదించినట్లుగానే, ఆయన అనుగ్రహాన్ని ఎన్నిరకాలుగా కోరుకోవాలో కూడా మనకు ఆగమాలు నేర్పించాయి. ఆ కోరికలన్నీ ఈ ఆగమ ఆశీర్వచనంలో ప్రతిఫలిస్తాయి. దీనిని ఆగమ పండితులు దేవాలయ దర్శనం చేసిన భక్తులకు ఆశీఃపూర్వకంగా అందిస్తుంటారు. ఇది సాక్షాత్తూ భగవంతుని ఆశీస్సులే అని భావించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆలయ సందర్శన సమయంలో మనం ఏఏ విషయాలను గమనించాలో ఈ ఆగమ ఆశీర్వచనంలో పండితులు చదివి వినిపిస్తారు. ఆలయంలోని ప్రతి చిన్న విభాగాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తారు. ఆ వర్ణన అంతా ఈ ఆగమ ఆశీర్వచనం గ్రంథంలో ఉంది. ఇంతవరకూ ఇది గ్రంథంగా రూపుదిద్దుకోలేదు. ఈ ఆగమ ఆశీర్వచన గద్యమ్ ద్వారా చదివి గర్భగుడి, మూలవిరాట్టు, ఉపాలయాలు, యాగశాల, గోశాల, ఇతర తీర్థవిశేషాలను దర్శించినందుకుగానూ భక్తులకు దక్కవలసిన పుణ్యమంతా లభించాలని పండితులు ఆశీర్వచనం చేస్తారు.