
AAHA EMI RUCHI - TELUGINTI VANTAKALU
₹80
In stock · 1 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
నా మాట "ఏ మగాడైనా తన కన్నతల్లికి, తండ్రికి, భార్యకు ఏనాడూ 'థాంక్యూ' అని చెప్పకూడదట. ఎందుకంటే ఆ ఋణం ఈ ముగ్గురికీ ఏమిచ్చినా జన్మజన్మలకు తీరదని" చాలా ప్రవచనాలలో చెప్పారు. వారు చెప్పినది అక్షరాలా వాస్తవం. స్వతహాగా నాకు చిన్నప్పటి నుండి వంట అంటే చాలా చాలా ఆసక్తి. ఆ ఆసక్తి వల్లే అమ్మ దగ్గర కూర్చుని దాదాపుగా ప్రతి ఐటమ్ ఎలా చెయ్యాలో తెలుసుకునేవాడిని. ఈ విషయంలో క్రెడిట్ అంతా అమ్మదే. కుంపట్లు, కట్టె పొయ్యిలు, రంపపు పొట్టు పొయ్యిలతో వంట చేసే రోజులు, అమ్మకు ఉదయం 9 కల్లా వంటంతా పూర్తయిపోవాలి. మేము భోజనము చేసేసి స్కూళ్ళకు వెళ్ళాలి. 10 గంటలకల్లా నాన్న భోంచేసి కోర్టుకు వెళ్ళేవారు. అసలు నా జీవితంలో ఏనాడూ ఆయనని ఒక్క రోజు కూడా వంటగదిలోకి రావడం నేను చూడలేదు. భోజనము చేయడానికి మాత్రమే వంటగదిలోకి వచ్చేవారు. అంతే! అంత హడావుడిలో ఉన్నా అమ్మ నాకు అన్నీ శ్రద్దగా ఏ ఐటమ్ ఎలా చెయ్యాలో చెప్పేది. అలా నాకు ఏ కూర ఎలా వండాలో, చారు ఎలా పెట్టాలో, పులుసు ఎలా పెట్టాలో, కందిపచ్చడిలో ఏమేమి వేసి చెయ్యాలో ఇలా బుర్రకు పట్టేసింది. వంట చేసేటప్పుడు ఏ వస్తువు ఎంత పాళ్ళల్లో వేయాలో తను వేసేటప్పుడు. నాకు చూపించి వేసేది. అమ్మ ఊరికే 'ఆ కూర కదుపు, కుంపటి విసురు, పాలు పొంగకుండా చూడు...' ఇలా అనేది కాని నేనుగా వంట చేసిన సందర్భమే ఏనాడూ రాలేదు. ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడప్పుడు వండుకున్నా వంటమీద కాస్త గ్రిప్ వచ్చింది. అమ్మకు ఏ Sixth Sense పని చేసిందో? మగపిల్లలమైనా మాకు వంట నేర్పింది. మరి మా అత్తగారు "రేపు పెళ్ళి అయ్యాక వంటా-వార్పూ అంపటం ఎలాగూ తప్పదు కదా! ఇప్పటినుండే పిల్లలకి ఈ యాతన ఎందుకు?" అని అనుకుందేమో! ఆవిడ పిల్లల్ని వంటగది ఛాయలకు రానివ్వలేదు. మరి అవసరమే అన్ని పనులు నేర్పుతుందేమో! పెళ్లయ్యాక అన్నం ఎలా వండాలో కూడా తెలీని నా భార్య నన్ను అడిగి ఒక్కొక్కటిగా వంట నేర్చుకుంది. ఈలోగా మా అమ్మ దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర, మా అమ్మమ్మ దగ్గర ఏడాది నిల్వ పచ్చళ్ళ ఆలూరు కృష్ణప్రసాదు