AALAYAVEDAM by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

AALAYAVEDAM

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹200
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
సుదర్శనం.... ఆలయ వేదం శ్రీ దర్శన తుల్యం. సుదర్శనం- భవాన నేత్రపర్వం నైవేద్యం ప్రాథ కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్యగారి "ఆలయవేదం" గ్రంథం జ్ఞాన, విజ్ఞాన తేజో విరాజితం, మానవ మాధవ కరదీపం. సులభం. సుగ్రాహ్యం. సుమధురం. భగవద్భక్తబృంద నైవేద్యం. హృద్యం. మనోహరం. సర్వజన మనోరంజనం. జన్మ సార్ధకపు ఔషధం. ఈశ్వర సందర్శనం. "ఆలీయస్తే జనా అత్ర ఇతి ఆలయః" జనులు ఈ ప్రదేశమందు వినమ్రతతో మనసా, వాచా, కర్మణా, త్రికరణశుద్ధిగా, ఆత్మాంకితులై అణగియుందురు. కనుక "ఆలయమ్". ఆలయం తాపత్రయోపశమనం. స్థూల, సూక్ష్మ, కారణ శరీర తారకం. ఆత్మను పరమాత్మలో లీనమొనర్చే దివ్యసౌధం ఆలయం. భుక్తి, ముక్తి ప్రదం. ఆలయ ఘంటానాదం " ఆగమార్ధంతు దేవానామ్ గమనార్ధంతు రాక్షసామ్ కుర్వే ఘంటారవమ్ తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ " అని, సద్గుణాలకు (దేవతలకు) ఆహ్వానం, దుర్గుణాల(రాక్షసుల) నిర్మూలనం. "విదంతి ధర్మా ధర్మా ఇతి వేద' దీనిచేత ధర్మాధర్మాలు ఎరుగుదురు కనుక "వేదం"." విద్" ధాతు నిష్పన్నరూపం వేదం."ఏనం విందంతి వేదేన తస్మాత్ వేదస్య వేదతా" (ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం). కావలసిన వాటిని తీర్చి, అక్కరలేని వానిని నిర్మూలించే ఏకైక సాధనం, ఆధ్యాత్మికోపాయం ఈ ఆలయవేదం... ''వేద' అంటే తెలుసుకొనుట అని అర్ధం ఏమి తెలుసుకోవాలి? దేనిని తెలుసుకున్న తరువాత ఇక తెలిసికోవాల్సింది ఏమి ఉండదో, దేనిని తెలుసుకుంటే సర్వము తెలిసినట్లు అగునో అట్టి జ్ఞానాన్ని, ఆత్మ, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. 'జీవిత గమ్యం తెలియని మానవుని తిరిగి, మాధవుడుగా (మానవుడే మాధవుడు), నరుడు నారాయణుడుగా, జీవుడు దేవుడుగా తన స్వస్వరూప సంస్థితిలో నిలిచి పోవడానికి మార్గం చూపేది ఈ "ఆలయవేదం". కనుక మానవుడు తరించాలంటే. తన జన్మను సార్థకం చేసుకోవాలంటే, జీవిత పరమార్ధమైన మోక్షాన్ని పొందాలంటే "ఆలయవేద" విజ్ఞానాన్ని, తప్పక తెలిసికోవాలి.