AAME JAYINCHINDI by ADELLA SHIVAKUMAR Telugu book cover

AAME JAYINCHINDI

by ADELLA SHIVAKUMAR

₹200
In stock · 15 available
PublisherSRIRAM SAMMUDDHI
LanguageTelugu
"Dear women, You are half the society and you rasise the other half. Please don't say you are equal to men, You are Far more superior." జీవితం మైనస్ ప్రేమ్ తర్వాత ఆ స్థాయిలో నాకు రచయితగా గొప్ప సంతృప్తినిచ్చిన నవల 'ఆమె జయించింది'. ప్రతిష్టాత్మకమైన 2014 స్వాతి అనిల్ అవార్డ్కు ఈ నవలను ఎంపిక చేసి శ్రీ స్వాతి బలరాంగారు గౌరవించటం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు... అమ్మను పురిట్లోనే చంపేస్తున్న మానవాళి భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదు. అమ్మ అంటే కేవలం స్త్రీ మాత్రమే కాదు. ఒక ఆవు, కుక్క, పంది, పిచ్చుక సమస్త ప్రాణులకు ఆధారభూతమైనది అమ్మే కదా! నాగరికత వికటాట్టహాసం చేస్తున్న ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మేధావులే కన్పిస్తున్నారు కానీ హృదయం వున్న మనుష్యులు ఆవిరైపోతున్న తరుణంలో రచయిత దు:ఖం ఈ నవలలో మీకు కన్పిస్తుంది. నిజాయీతీగా వ్రాస్తే పాఠకుల స్పందన అద్భుతంగా వుంటుందన్న సత్యం మరోసారి ఈ నవల ద్వారా ఆవిష్కృతం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాఠకులు ఈ నవలను చదివి కన్నీళ్ళ పర్యంతం అవుతూ నాకు ఫోన్లు చేసారు. మెస్సేజ్లతో నా మొబైల్ ఇన్బాక్స్. నిండిపోయింది. పాఠకుల దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు... జ్ఞానం అంటే మేధస్సు కాదు దయ... అనిల్ అవార్డ్ ప్రదానం చేస్తూ స్వాతి బలరాంగారు ఎంత అద్భుతమైన వాక్యాలతో ఈ నవలను విశ్లేషించారో తల్చుకుంటే హృదయం ఉప్పొంగుతుంది.