
AARU RUCHULATO AAROGYAM
₹90
In stock · 11 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ఆరు రుచులతో ఆరోగ్యం సర్వే శరీర దోషాభవన్తి గ్రామ్యాహారాదమ్ల లవణ కటుక క్షార శుష్క శాక మాంస తిల పలల పిష్టాన్న భోజినాం విరుద్ధ నవ శూక శమీధాన్య విరుద్ధా సాత్మ్య రూక్ష క్షారాభిష్యన్ది భోజినాం క్లిన్న గురు పూతి పర్యుషిత భోజినాం విషమాధ్యశన ప్రాయాణాం దివాస్వప్న స్త్రీ మధ్య నిత్యానాం విషమాతిమాత్ర వ్యాయామ సంక్షోభిత శరీరాణాం భయ క్రోథ శోకలోభమోహాయాస బహులానామ్॥ నాగరికుడైన మనిషి తీసుకునే ఆహారాన్ని 'గ్రామ్య ఆహారం' అంటారు. గ్రామం అంటే, కేవలం పల్లెటూరు అనే కాదు. అది మున్సిపాలిటీ కానీండి, కార్పొరేషన్ కానీండి సమస్త వసతిసౌకర్యాలూ అందుబాటులో వుండే ప్రాంతాన్ని 'గ్రామం' అంటారు. ఆధునికత పెరిగేకొద్దీ కృత్రిమత పెరుగుతుందంటాడు చరక మహర్షి గ్రామీణులు (నాగరకులైన ప్రజలు) ఆహార విహారాలు పాటిస్తూ, కృత్రిమమైన రీతిలో జీవిస్తూ వుంటారు కాబట్టి, ఈ కృత్రిమతే అనేక వ్యాధులకు కారణం అవుతోందంటూ ఈ సూత్రాన్ని చరకమహర్షి వివరించి చెప్పాడు. 1. పులుపు, ఉప్పు, కారం ఈ మూడు రుచులతో కూడిన ఆహారాన్ని నాగరకులు అధికంగా తింటూ వుంటారు. క్షారాల్ని కూడా అతిగా తీసుకొంటూ వుంటారు. ఇవి అనేక వ్యాధులకు కారణం అవుతాయి. 2. కోసిన తర్వాత అనేకరోజులు నిలవున్న కూరగాయల్ని తింటూ వుంటారు. ఇదీ వ్యాధికారణమే! 3. ఎండుమాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇంతకన్నా హానికరం ఇంకేముంటుంది?