
AASA - ANDHRAVISWAVIDHYALAYAM SATAKAM
₹40
In stock · 472 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
AA.SA. (AndhraViswavidyalaya Sathakamu) by Illa Muralidhara Rao ఇది మా ఏ.యూ / ఆంధ్ర విశ్వవిద్యాలయం / ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ప్రస్థానం. విశాఖపట్నంలో విశ్వవిద్యాలయ స్థాపన ఆలోచన ఎవరిది? ప్రేరకులెవరు? కారకులెవరు? స్థాపకులెవరు? స్థల దాతలెవరు? పై ప్రశ్నలకు సమాధానమే ఈ శతకం. విద్యాలయం అంటే గుడి. ఆ ఋణం తీర్చుకోవడం ఎవరికైనా అసాధ్యమే. కానీ అందుకు ప్రయత్నించడం తప్పు కాదుకదా? ఈ శతకానికి ఆ.శ. (ఆంధ్రవిశ్వవిద్యాలయ శతకము) అని పేరెందుకు పెట్టానంటే, ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదవాలని నా ఆశ. (నా కల. నా తండ్రిగారికిచ్చిన మాట). ఇందులో ఈ విశ్వవిద్యాలయ పుట్టుక, వృద్ధి, గమనములను లీలగా స్పృశించాను. ఇక్కడ ఎందరెందరో మహానుభావులు, మేధావులు చదువుకొని వారు తరించి, ఈ విశ్వవిద్యాలయాన్ని తరింపజేశారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు, ఇతర విద్యార్థులకు, తెలుగు ప్రజలకు ఈ విశ్వవిద్యాలయ చరిత్ర కాసైనా తెలియాలని, తెలుసుకోవాలని, (అంటే, ఇప్పటివరకూ తెలియదని కాదండోయ్! కొత్త తరాల కోసం), తెలుసుకొని గుర్తుంచుకోవాలని, ఒక తెలుగు పరిశోధక విద్యార్థిగా నా ఈ చిరు ప్రయత్నం. ఇది పద్యరూపంలో ఉన్నప్పటికీ, అందరికీ సులువుగా అర్థం కావడం కోసం ప్రతీ పద్యం కింద వచనంలో వివరణ ఇవ్వబడింది. సహృదయ పాఠకులు అర్థం చేసుకొని, ఆదరించి నన్ను చరితార్థుడిని చెయ్యగలరని మురళీధరుడు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004