
AAVAHINCHINA AKSHARAM
by NIKHILESHWAR
₹55
In stock · 408 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
భారతీయ వర్గసమాజంలో సాహిత్యం - సంస్కృతి ఈనాటి భారతీయ సమాజం కులం మతం చేతుల్లో బందీయై నిలుచుంది. ధనికస్వామ్యం కోరలు చాస్తున్న మేర వర్గ సమాజం చోటుచేసుకుంటున్నది. ధనిక -పేద వర్గాలు అనేవి వుండవని, మనుష్యులు వాళ్ళ పూర్వజన్మ సంచితాల వల్ల సంపన్నులు గానో లేదా దరిద్రులుగానో బ్రతుకుతారనే అభిప్రాయం గల రచయితలు అసలు వర్గాలు ఎక్కడివి? ఈ వర్గ పోరాటం గొడవెందుకు? అందరి శ్రేయస్సుకు సాహిత్య మంటే మంచిదని ఆ రచయితలే అమాయకంగా భావవాదధోరణిలో మాట్లాడుతారు. కాని ఈనాటి (తెలుగునాడులో) సాహిత్య ప్రక్రియలన్నీ సినిమాలకు, పబ్లిషర్లకు, మంత్రులకు - రేడియో, టి.వి., పత్రికలకు ఎలా అమ్ముడు పోతున్నాయో గ్రహిస్తే ఆ ప్రశ్న ఉదయించదు. వ్యాపారం చేస్తున్న సంపన్నులు కాలక్షేపానికి 'కబుర్ల సాహిత్యాన్ని ఎంత సజావుగా పండిస్తున్నారో తెలుసుకుంటే అసలు ఈ సాహిత్యం ఎవరి శ్రేయస్సుకు ఉపయోగపడుతూ వుందో తెలుస్తుంది. ఉత్తమ సాహిత్యం అనేది ఎప్పుడైనా కళావిలువలు దెబ్బతినకుండా - కష్టజీవి కేంద్ర బిందువుగా ఏనాటికైనా వ్యక్తి వికాసాన్ని- విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూనే వుంటుంది. అయితే ఆ 'ఉత్తమ- సాహిత్యం' అనేది ఎవరు రాస్తున్నారు?. ఎవరికి ఉపయోగపడుతున్నది? బూటకపు సోషలిజం కబుర్లు చెబతూ మభ్యపెట్టే రచనలు చేస్తున్న మహానుభావులు చివరికి కష్టజీవి కన్నీళ్ళను కూడా ఒక సరుకుగా వినియోగించుకోడం లేదా? సాహిత్యం, వాస్తవ జీవితం దేని మానాన అది పొంతన లేకుండా సాహిత్య సంస్కృతి ప్రభావాలు ఎక్కడున్నాయి?- ఇవి ఈనాడు అతి ప్రధానమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఈ సమాజం లోని యధార్థ జీవిత వ్యధార్థ దృశ్యాలలోంచి వెతుక్కోకపోతే చాలా ప్రమాదాలున్నాయి.