
ABHIGNA
by DR.NANDAMURI LAKSHMI PARVATHI
₹150
In stock · 258 available
PublisherRUSHI PRACHURANALU
LanguageTelugu
ಅಭಿಜ್ಞ "మిత్రమా! ఎందుకు పరధ్యాన్నంగా వున్నావు?" “ఏం లేదు మనసన్నాక అది ఏదో ఆలోచిస్తూనే వుంటుంది." "అది నాకు చెప్పకూడని రహస్యమా?" "నీ దగ్గర దాచగలిగింది ఏముంది? నా జీవితం గురించే ఆలోచిస్తున్నాను." పడ్డాడు. “నా కంటె ఎక్కువ కష్టాలున్నాయా? మొదటి వ్యక్తి అతని ప్రక్కన చతికిల పచ్చటి పచ్చిక ఆ ప్రాంతమంతా ఒత్తుగా పరుచుకుని వుంది. గురుకులాశ్రమానికి కొంచెం దూరంగా ఆ మిత్రులిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు హిమాలయ పర్వత సానువుల నుండి చందన పరిమళాన్ని మోసుకొస్తున్న గాలి వాళ్ళ శరీరాలను స్పృశించి వెళ్ళిపోతున్నది. ఆ సువాసనలకు ఇద్దరి కళ్ళు అరమోడ్పులయ్యాయి. "మిత్రమా! సాంగత్య ఫలం చూసావా.” చందనంతో కలసి ఈ గాలి సువాసనలను విరజిమ్ముతున్నది. అదే మురికి వాసనలతో కలిస్తే దుర్గంధమవుతుంది. అందుకే స్నేహం గుణదోషాలకు దారితీస్తుంది." "నిజం హితుడా! నీ స్నేహం వలన నేను నా బాధల నుండి విముక్తడనయ్యాను ఇటువంటి శాంతి ఈ నేలలో కూడా వుంది." “ఆ మాట నిజం ధాతుసేనా! ఈ హిమాలయాలు-ఈగాలి-ఈ నేల-గంగానది ఈ చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఎంత అదృష్టం చేసుకుని ఈ పుణ్యభూమిలో పుట్టానా అన్పిస్తున్నది." "అది నిజం కాళీ! నేను ఇక్కడ పుట్టకపోయినా నా బాల్యం నుండి ఈ దేశంలోనే పెరిగాను. ఈ ఆశ్రమాలే నాకు తల్లీ తండ్రీ అయి ఆదుకున్నాయి. ఎన్ని జన్మలెత్తినా ఈ భరతమాత ఋణం తీర్చుకోలేను." అతని కళ్ళల్లో తడి. "అంత బాల్యంలోనే ఇక్కడికి ఎందుకొచ్చావు?" "చెబుతాను మిత్రమా! అటు చూడు మేఘాలు శిఖరాలతో ఎలా ఆడుకుం " టున్నాయో?"