
ABHINAYA VISHARADA - URVASI SHARADA
₹200
In stock · 96 available
PublisherYAITLA KISHORE KUMAR
LanguageTelugu
ముందుమాట తెలుగు సినీరంగంలో తమ అభినయ ప్రతిభతో అలరించిన అద్భుత నటీమణులు ఎందరో ఉన్నారు. కొందరు అందచందాలతో మురిపిస్తే, మరికొందరు తమ అభినయ ప్రతిభ తో చిరయశస్సు సంపాదించుకున్నారు. కన్నాంబ, భానుమతి, జానకి వంటి నటీమణులు తమ అభినయంతో వెండితెరపై తరగని కీర్తి శాసనాలు లిఖించారు ఆ వరసలోనే అచ్చ తెలుగు ఆడబిడ్డగా పుట్టి, ఆంధ్ర రంగస్థలంపై అభినయ సౌరభాలు వెదజల్లిన "సరస్వతీదేవి”, తెలుగు సినీ స్వర్ణ యుగంలో ఆ సరస్వతీదేవికి మారుపేరైన “శారద"గా తన అడుగు మోపి, విలక్షణ పాత్రలతో అలరించి, ఆపై మలయాళ చిత్ర రంగంలో అడుగుపెట్టి తిరుగులేని నటీమణిగా తన అభినయ ప్రతిభతో జాతీయస్థాయిలో మూడుసార్లు ఊర్వశి అవార్డు అందుకున్న నటిమణి, ద్వితీయార్థంలో తెలుగు చిత్రసీమలో నాటి కన్నాంబను మరిపించేలా ఒక కంట కరుణారసం, మరోకంట రౌద్ర రసం కురిపించి అఖిలాంధ్ర ప్రేక్షకుల నీరాజనాలందుకున్న అభినయ దురీణ, కురిపించేది మహాసాధ్వి మల్లమ్మగా భక్తిరసమైన, కర్షక లోకం కోసం ఎలుగెత్తిన కరుణారసమైన, అరాచక శక్తులపై శాంభవిగా కురిపించిన రౌద్రరసమైన, డాక్టర్ భవానీ గా, లాయర్ భారతీదేవిగా, కలెక్టర్ నాగమణి దేవిగా, ఇన్స్పెక్టర్ ఝాన్సీగా, జడ్జి యశోదరాదేవిగా, సామ్యవాదం కోసం అన్నతోనే తలపడ్డ భువనేశ్వరిగా, అడవి బిడ్డలకు అక్షరాలు దిద్దించి ఏకలవ్యులను చేసిన వసుంధరగా, ప్రతీకారంతో పరవళ్ళు త్రొక్కిన రాజేశ్వరి దేవిగా, రైతు పోరాటం కోసం రణభేరి మ్రోగించిన రాజ్యలక్ష్మి గా ఆమె రూపశిల్పం పై రూపుదిద్దుకున్న పాత్రలు తెలుగు చిత్రకళా ప్రాంగణంలో సజీవంగా నిలిచిపోయాయి. ఆ మహానటిమణి అద్భుత అభినయాన్ని గుర్తు చేస్తూ ఆ కళాసరస్వతికి అర్పిస్తున్న అక్షర నీరాజనం ఈ అభినయ విశారద ఊర్వశి శారద