
ABHYUDAYA SAHITHYODYAMAMLO THOLITARAM COMMUNISTULU
₹40
In stock · 290 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కమ్యూనిస్టు రచయితలు మొదటి ప్రపంచ యుద్ధానంతర కాలంలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం, ప్రమున వ్యాపితంగా సాంస్కృతిక సంక్షోభాన్ని కూడా సృష్టించింది. ఒకవైపు రష్యన్ సోషలిన విప్లవం ఆశావహమైన పరిణామంగా కనబడుతున్నప్పటికీ, మరోవైపు ఫాసిజం ప్రమాదం. పొంచి ఉన్న నేపథ్యంలో కమ్యూనిస్టు రచయితలు పారిస్లో సమావేశమయ్యాను. సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను చేపట్టారు. అంతేకాదు. స్పా అంతర్యుద్ధంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కొండవ యుద్ధంలో అసువులు బాశారు. మరికొందరు తీవ్రంగా గాయపడి, తరువాతి కాలంలో కన్నుమూశారు. కమ్యూనిస్టుల అంతర్జాతీయ సౌభ్రాతృత్వాన్ని ఆచరణద్వారా ప్రకటిం చూపారు. యావత్ ప్రపంచ సాహిత్యంలో రూపంలోనూ, వస్తువులోనూ, భాషలోనూ భావ వ్యక్తీకరణంలోనూ మౌలికమైన మార్పును తెచ్చిన మహోద్యమం కమ్యూనిజాయి మట్టి మనుషులను మహాకవులుగా, సామాన్యులను మాన్యులైన మహారచయితలూ రూపొందించిన ప్రాపంచిక దృక్పథం కమ్యూనిజం. ఇదొక తాత్విక దృక్పథం, రాజకీయ ఆర్థిక శాస్త్రం, జీవన విధానం. ప్రపంచ గమనాన్ని మార్చడానికి కావలసిన సిద్ధాం స్పష్టతతో సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన ప్రజారచయితలే అభ్యుదయ రచయితలు. అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, కమ్యూనిస్టు పార్టీ భావజాల రంగంలోన క్రియాశీల కార్యకర్తలుగా కొనసాగడం కత్తిమీదసాము వంటిది. ఒకవైపు సృజనాత రచయితలుగా సాహితీక్షేత్రంలో కృషిచేస్తూనే, మరోవైపు క్రమశిక్షణగల సైనికులు కొనసాగడం కమ్యూనిస్టులైన అభ్యుదయ రచయితల బాధ్యత. ఇక్కడే సంస్థాన. నిర్మాణరూపంలో రాటుదేలే రచయితలకూ, సంస్థల బయట ఉంటూ యధేచ్ఛగా రచను చేసే సాహితీవేత్తలకూ తేడా ఉంటుంది. శ్రామికజన పక్షపాతం, పీడితవర్గ దృష్టి, వాస్తవికాని దృక్పథంతో రచనలు చేస్తూనే- సమాజంలోని విలక్షణమైన పాత్రలకు ప్రాణంపోన సాహితీ ప్రక్రియలనూ, కళారూపాలనూ సృష్టించాల్సిన పనితనం కమ్యూనిస్టు రచయితలు ప్రదర్శించాల్సి ఉంటుంది. సమాజానికి జవాబుదారుడిగా ఉంటూనే, సమాజా పురోగమన దిశకు నడిపించే క్రాంతదర్శులు వీరు. రానున్న సమాజం రూపురేఖలను ఊహించి చూపే రూపశిల్పులు కూడా వీరే.