
ABHYUDAYA SAHITYANIKI ATU - ITU
₹20
In stock · 197 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ మేరు సమాన ధీరుడు డా॥ ఆవంత్స సోమసుందర్ విరియాల లక్ష్మీపతి నాటక రచయితగా లబ్ధ ప్రతిష్ఠుడు. ఆరుబయట అరుణోదయంతో' కవితా లోకానికి పరిచయమయ్యాడు. లక్ష్మీపతి రాసిన పంచమవేదం అనే నాటకం బహుళ ప్రచారం పొందింది. పత్తిపాడులో ఆ నాటకం చూసి నేను థ్రిల్లయ్యాను. ఆ నాటకం సుమారు వందకి పైగా ప్రదర్శనలు పొంది, ఎంతోమంది నాటక కళావేత్తలకు ఉత్ప్రేరకమయ్యింది. అభ్యుదయ రచయితల సంఘం, విశాఖ శాఖ పురోభివృద్ధికి అకుంఠితంగా కృషి చేస్తున్నాడు. శ్రీశ్రీ సాహిత్య ప్రత్యేక అధ్యయనంతో విమర్శనా సాహిత్యంపై తన దృష్టిని మరల్చాడు. నాటికలు నాటకాలు రచించి, కవితలు దీర్ఘ కవితలు మీదుగా సుదీర్ఘ ప్రయాణం సాగించి సాహితీ ద్రష్టగా నిలదొక్కుకొని షష్టిపూర్తి చేసుకున్నాడు లక్ష్మీపతి. శ్రీశ్రీ మహా ప్రస్థాన గీతాలపై వచ్చిన ప్రశంసా విమర్శలు మరే ఇతర కావ్యంపైనా రాలేదన్నది అత్యుక్తేకాని, అతిశయోక్తికాదు. శ్రీశ్రీ శబ్దశక్తి పట్ల భక్తితో పారవశ్యంతో రసాస్వాదన ప్రారంభమై ప్రతి పదానికి కొత్త అర్థాలు, కొత్త భాష్యాలు చెప్పడం అనేది అనుస్యూతంగా కొనసాగుతోంది. శ్రీశ్రీ ప్రభవతో లక్ష్మీపతి అధ్యయనం ప్రారంభమై శ్రీశ్రీ రాయని కావ్యం విశాఖపట్టణం మీదుగా శ్రీశ్రీ అనువాద కథల వరకూ కొనసాగింది. యారాడకొండ కొసలు స్పృశించింది.