ABRAHAM LINCOLN CHATUROKTULU YADARDHA SANGHATANALU by K.HARINATHAREDDY Telugu book cover

ABRAHAM LINCOLN CHATUROKTULU YADARDHA SANGHATANALU

by K.HARINATHAREDDY

₹60
In stock · 3 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
అబ్రహాం లింకన్ కడు పేదవాడు. కొంతకాలం యుద్ధంలో సైనికుడుగా పనిచేశాడు. తరువాత న్యాయవాది అయ్యాడు. రాజకీయాల్లోకి దిగి, క్రమంగా ఎదిగి 1860లో అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడయ్యాడు. 1862లో ఆయన బానిసత్వ నిర్మూలనా చట్టం తీసుకొచ్చాడు. కష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు హాస్యస్ఫోరకంగా మాట్లాడటం, ఛలోక్తులు విసరడం ఆయనకు ఆటవిడుపుగా ఉండేది. ఇతరులను విమర్శించడం ద్వారా, బాధించడం ద్వారా సాధించే హాస్యాన్ని అందరూ ఆస్వాదించలేరు. సందర్భశుద్ధితో, చమత్కారంతో ఎదుటి వ్యక్తిని అలరించేలా ఉండే సున్నితమైన హాస్యం ప్రశస్తమైంది. అటువంటి హాస్యోక్తులకు లింకన్ పెట్టింది పేరు. లోకజ్ఞతతో చేయి కలుపుతూ, స్వచ్ఛంగా, హాయిగా, హుందాగా, ఆరోగ్యవంతంగా ఉండే హాస్యం లింకన్. ఎదుటి వ్యక్తిని చూసి నవ్వడం కంటే, ఎదుటి వ్యక్తితో కలిసి నవ్వడమంటేనే లింకను ఇష్టం. జీవితాన్ని ఒక సాధనగా, తపస్సుగా, దీక్షగా మాత్రమే కాకుండా, ఒక వేడుకగా, సంబరంగా, మహోత్సవంగా గడిపిన అత్యుత్తమ మానవుడు ఆయన. అందుకే ఆయన హాస్యోక్తులు, ఛలోక్తుల సమాహారం ఈ పుస్తకం. పాఠకుల్ని నవ్విస్తూ, కవ్విస్తూనే ఈ పుస్తకం వాళ్లను మరింత మంచి మానవతావాదులుగా మారుస్తుంది. ఇది పిల్లలకు ఆటవిడుపు. పెద్దలకు ఔషధం. అందరికీ గొప్ప కరదీపం.