ADAVARIKOSAM AYURVEDAM by DR.G.V.PURNACAHND Telugu book cover

ADAVARIKOSAM AYURVEDAM

by DR.G.V.PURNACAHND

₹50
In stock · 8 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ఆడవారి కోసం ఆయుర్వేదం ఆరోగ్యం కోసం సుగంధభరిత స్నానం రాజులు, మహారాజులే కాదు, మనం కూడా రోజూ సుగంధ భరితమైన స్నానం చెయ్యవచ్చు. చాలా తేలికగా దొరికే వన మూలికలతో అద్భుతమైన సుగంధం వచ్చే పౌడర్లు తయారు చేసుకొని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి మామూలు మధ్యతరగతి ఇంకా పేదవారు కూడా తయారు చేసుకోగల వైద్య రహస్యాలు. గుప్పిట విప్పేస్తున్నాం. ప్రజలందరికీ పంచిపెట్టేస్తున్నాం. అందుకోండి. ప్రియపాఠకులారా!! * కచ్చూరాలు, జటామాంసి, దాల్చినచెక్క వీటిని మెత్తగా దంచిన పౌడర్ ని రెండుమూడు చెంచాల మోతాదులో తీసుకొని చెంబుడు నీళ్ళలో వేసి, బాగా మరిగించి వడగట్టి, ఆ కషాయాన్ని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుంటే, నీరంతా సుగంధ భరితంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత కూడా ఆ సుగంధం శరీరంపైన ఎక్కువసేపు నిలబడి ఉంటుంది. ఒకటి లేక రెండు పచ్చకర్పూరం పలుకులు కూడా ఈ నీటిలో కలుపుకోవచ్చు. పైన చెప్పిన జటామాంసి కచ్చూరాలు వగైరా చాలా తేలికగా వనమూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. * ప్రేంఖణపు చెట్టు (ప్రియంగు మీకు తెలిస్తే దాని చెక్కని తీసుకోండి.