
ADDAMLO CHANDAMAMA
₹40
In stock · 6 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నా కథల్లోకి వెళ్ళేముందు..... నేను స్కూలు చదువులో ఉండగా చందమామ, బాలమిత్ర చదివేదాన్ని. కాలేజీ స్థాయికి వచ్చాకనే నవలలు, వీక్లీలు చదవాలనే కట్టుబాటు వుండేది. మా ఇంట్లో. పిల్లలకోసం రాసిన రామాయణం, మహాభారతం, భాగవతాలు చదివించేవారు మా అమ్మమ్మ కీ.శే. 'అనంతమ్మ' తాతయ్య కీ.శే. శ్రీనివాస రెడ్డి (వకీలు). ఆనాటి నుండి ఈనాటి వరకు విష్ణుసహస్రనామ శ్లోకాలు, భగవద్గీత లాంటివి నిత్యం పారాయణం చేయటం దినచర్యలో భాగమైంది. కాలేజీకి వచ్చిం తర్వాత యద్దనపూడి నవలలు ఇష్టంగా చదివేదాన్ని. దేశవిదేశాల్లో వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్నప్పుడు ఆ ప్రాంతాల విభిన్న సంస్కృతులనూ, ఆచార వ్యవహారాలనూ ఆసక్తిగా గమనించే అలవాటు. ఎక్కడికెళ్ళినా, ఏది చూసొచ్చినా చూసింది చూసినట్టు చెబుతుంటే మా యింట్లో అందరూ ఆసక్తిగా వినేవారు. పరిశీలనగా గమనించి వరుసక్రమంలో నేను చెప్పే విషయాలు వినసొంపుగా ఉంటాయని అందరూ మెచ్చుకోవడం బహుశా కథలు రాయడానికి తోడ్పడి ఉంటుంది. నాకు తెలిసిన ప్రపంచం గురించి నేనెరిగిన మనుషుల గురించి రాయడం, యథార్థ సంఘటనలకు చిన్న చిన్న మార్పులు చేర్పులతో కథారూపం ఇవ్వటం మాత్రమే నాకు తెలుసు. సాహిత్యం, శైలి, శిల్పం యిలాంటి వాటి గురించి నాకు అంతగా తెలియదు. నేను పుట్టి పెరిగిన నేపథ్యాన్ని బట్టి మనిషి జీవితంలోని కొన్ని కోణాలు అంత లోతుగా నాకు తెలియవు. ఒక అవగాహన, నిశిత పరిశీలన ఏ రచయితకైనా రచయిత్రికైనా ప్రాథమిక అర్హత, అవసరం కాబట్టి, అన్నింటినీ జాగ్రత్తగా గమనించే నా సహజ లక్షణాన్ని మరింత మెరుగు పరిచాను. ఈ కొద్దిపాటి ముడిసరుకుతో నాకు చేతనైన రీతిలో ఈ కథలు రాశాను. ఇవి వివిధ పత్రికలలో ప్రచురితమైనప్పుడు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు తెల్పుతూ ప్రోత్సహించిన పాఠకులకు ముందుగా నా కృతజ్ఞతలు. మా సన్నిహిత కుటుంబాలలో యిట్లా రచనా వ్యాసంగాలు పెట్టుకున్న వారెవరూ లేరు. కథ లేదా నవల రాశాక దానిని పత్రికలకు ఎట్లా