
ADHIKA RAKTHA POTU
₹60
In stock · 9 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
మనవి అధిక రక్తపోటు ('హైపర్టెన్షన్' లేక 'హై బి.పి') ప్రపంచమంతటా ముఖ్యంగా మన దేశంలో విస్తారంగా ఉన్న వ్యాధి. ఈ వ్యాధిలో కాంప్లికేషన్లు వచ్చేవరకు ఆ వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. డాక్టర్ దగ్గరకు మరో బాధతో వెళ్లినప్పుడుగాని, ఇన్సూరెన్స్ లేదా జనరల్ చెకప్లో గాని 'అధిక రక్తపోటు’ మొదటిసారిగా బయట పడవచ్చు. నిశ్శబ్దంగా పెరిగి, గుండె, మెదడు, మూత్రపిండాలు, నేత్రాలు, కాళ్ల రక్త ప్రసారాల్లో మార్పులను కలిగించి, ఆరోగ్యాన్ని విషమ పరిస్థితికి తీసుకువచ్చే అవకాశం ఉంది కాబట్టే, ఈ వ్యాధిని 'సైలెంట్ కిల్లర్' అని వైద్యరంగంలో పిలుస్తున్నారు. డాక్టర్ ఒక వ్యక్తికి అధిక రక్త పోటు ఉన్నదని నిర్ధారణ చేసిన తరువాత, ఆ వ్యక్తి బహుశా జీవితాంతం, చికిత్సను ఆహార నియమాలను కొనసాగించవలసి ఉంటుంది. 40 సంవత్సరాల క్రిందట కంటె, నేడు వివిధ తరగతులకు చెందిన అనేక మంచి మందులు అధిక రక్తపోటును నియంత్రించడానికి అందుబాటులో ఉన్నాయి. 4 దశాబ్దాలక్రిందట 'రిసెర్ఫిన్', 'ప్రొప్రనలాల్', 'ఎటెనలాల్', 'మిథైల్డీపా' వంటి కొద్ది మందులే ఉండేవి. వాటికి కొంత మందిలో దుష్ఫలితాలు కనపడేవి. కొన్ని దశాబ్దాల క్రిందట వయస్సును బట్టి (ఉదాహరణకు 100 + వయస్సు అంటే 70 సంవత్సరాల వారికి 170) సిస్టోలిక్ రక్తపోటు అధికంగా ఉండవచ్చు అనే అపోహలో ఉండేవారు. ఇది తప్పని వైద్య శాస్త్రజ్ఞులు నిరూపించారు. 80 సంవత్సరాల వృద్ధులకు కూడా రక్తపోటు 140/90 కంటె తక్కువ ఉండవలసిందే. 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో సిస్టోలిక్ రక్తపోటు పెరిగి, డయాస్టోలిక్ రక్త పోటు 90 కంటె తక్కువ ఉండవచ్చు. దీనిని 'సిస్టోలిక్ హైపర్ టెన్షన్' అంటారు. దీనివల్ల వృద్ధుల్లో అనేక కాంప్లికేషన్లు రావచ్చు. దీనికి కూడా తప్పక చికిత్స చేయించుకోవాలి.