
ADHUNIKANDHRA KAVITVAM - TATVIKATA VAIVIDHYAM
₹500
In stock · 60 available
PublisherDR.KASALA NAGABHUSHANAM
LanguageTelugu
ISBN9789356209381
రాజకీయవేత్తలూ, సంఘ సంస్కర్తలూ, సాహిత్యోద్యమకారులూ, మత ప్రచారకులూ, అర్థశాస్త్రవేత్తలూ మానవ సంక్షేమం కోసం ప్రతిపాదించే సిద్ధాంతాలన్నీ తత్త్వసంపన్నాలే! మానవ జీవితం భిన్న తాత్త్వికతా దృక్పథ విశిష్టమైన చైతన్య స్రవంతి. ఆ దృష్టితో పరిశీలించినప్పుడు ఆధునికాంధ్ర కవిత్వంలో కనిపించే మానవతా నైతిక మత ఆర్థిక రాజకీయ సౌందర్య తాత్త్వికతా విశిష్టమైన సమగ్రమైన సామాజిక తాత్వికతను గురించి పరిశోధకుడీ సిద్ధాంత వ్యాసంలో సువిపులంగా వివరించడం జరిగింది. - ఆచార్య వి. రామచంద్ర చౌదరి తాత్త్వికతను ఇన్ని విధాలుగా విభాగించడం, అన్నిటినీ హేతుబద్ధంగా నిర్దారించడం, అన్నింటికీ సాహిత్యం నుంచి ఉదాహరణలు చూపించడం, ఆయా రంగాల్లో అప్పటికే కృషి చేసినవారి లిఖిత- మౌఖిక అభిప్రాయాలను సేకరించడం, విశ్లేషించడం, గీటుపెట్టి నిగ్గుతేల్చడం - ఇది అంతా నూటికి నూరుపాళ్ళు నిజాయితీగా పేర్కోవడం- ఎంత కృషి చేశారండీ! ఎంత నిజాయితీగా చేశారండీ! బంగారు తండ్రివి!! ఆచార్య బేతవోలు రామబ్రహ్మం పాఠకులు ఆశ్చర్యపోయే అంశం ఏమిటంటే, నాగభూషణం గారు ప్రతి తాత్వికతను చర్చించే సందర్భంలో కందుకూరి నుండి మద్దూరి దాకా, ఎవరెవరు ఎక్కడెక్కడ కుదురుతారో అక్కడక్కడ వాళ్ళ కవితలను ఉదాహరించి అన్వయించడం. ఈ క్రమంలో ఒకే రచయితను అనేక పర్యాయాలు ప్రస్తావించడానికి సంకోచించలేదాయన. అంటే ఆయన ఆధునిక తెలుగు కవిత్వాన్ని ఏడు పర్యాయాలు నిలువుగా విశ్లేషించారని పాఠకులు గుర్తించగలరు. ఇది చాలా ప్రయాసతో కూడిన పనే. నాగభూషణం గారి పరిశోధన గ్రంథం సమగ్రమైనది, పరిపుష్టమైనది ఈ కారణం చేతనే. .ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి తెలుగులో వచ్చిన కవిత్వ విమర్శకు అనుబంధంగా నిలిచే మరో విమర్శగా రచయిత తన గ్రంథాన్ని పేర్కొన్నారు. అది వాస్తవం. ఏ కవీ ఒక ఉద్యమానికో, వాదానికో ముడిపడి ఉండడు. ప్రత్యంశమూ కాలాల పర్యంతం కనిపిస్తుంది- ఎంతో కొంత మార్పుతో. ఏ సాంఘిక తత్త్వాన్ని కవిత్వం బోధిస్తున్నా, దాని ఆత్మగతమైనది సౌందర్యమని విశ్వసించారు. నేటి పరిశోధక లోకానికి ఈ రచనలోని కొత్త దృక్కోణం ఉపయోగకరం. .ఆచార్య కె. మధుజ్యోతి ISBN 935620938-3