ADHYATMIKATHA THO SAMPOORNA AROGYAM by DR.PEKETI GEETASIVARAM Telugu book cover

ADHYATMIKATHA THO SAMPOORNA AROGYAM

by DR.PEKETI GEETASIVARAM

₹50
In stock · 8 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ఆరోగ్య సిద్ధి వినాయక చవితి భారతీయ మహర్షులు సృష్టించిన సంస్కృతీధులు. మన సాంప్రదాయ విధులు, మన పండుగలు సృష్టి రహస్యాలను, ఆరోగ్య నియమాలను కాలమాన వాతావరణ స్థితులను కలగలిసిన, కమనీయ ఆరోగ్య సుగంధాలను పండుగ విధుల్లో పంచి పెట్టారు మన పూర్వులు. వర్షాకాలంలో వచ్చే మొదటి పండుగ వినాయకచవితి. క్రొత్త నీరు, కలుషిత వాతావరణం, కంటికి కనిపించని సూక్ష్మజీవులు, వైరస్, విపరీతంగా ప్రబలి గాలిలో, నీటిలో కలసిపోతాయి. ఆ నీటిని త్రాగినా, గాలి పీల్చినా ప్రాణుల శరీరాల్లో వాతపిత్త కఫాలు ప్రకాశిస్తాయి. ఆకారణంగా వాత వ్యాధులు, పైత్య వ్యాధులు, శ్లేష్మ వ్యాధులు ప్రకోపిస్తాయి మానవ జాతినే అష్టకష్టాలూ పెట్టిస్తాయి. ఈ కష్టాల పరిష్కారానికి ఔషధంగా వినాయకచవితి పండగ వచ్చింది. వినాయకచవితి పూజకోసం వాడే మూలికలతో స్వామిని పూజించి వ్యాధుల నుంచి రక్షణ పొందాలని, సర్వ జీవగణాధిపతుడు, ప్రతీ మనిషిలోని మూలాధార చక్ర నివాసితుడు ఐన వినాయకుని ఆరాధించిన మూలికలతో పూజించి, రక్షణ పొందడం మన సాంప్రదాయంగా రూపొందిచారు మహర్షులు. ఈ మూలికలను సేకరించేటప్పుడు, వినాయకుని పూజ చేసేటప్పుడు వాటి స్పర్శ, గాలి మనకు తగలటం వల్ల ఇంటిలో చేరిన క్రిములు నశిస్తాయి. ఆ మూలికా గంథాన్ని పదే పదే పీల్చటం వల్ల శరీరంలోని త్రిదోషాలూ పటా పంచలైపోతాయి. మట్టి వినాయకుని, పూజకు వినియోగించిన పత్రులు తీసుకెళ్ళి చెరువులో, బావుల్లో వేయటం వల్ల నీటిలోని విష సూక్ష్మజీవులు నశించి, నీరంతా ఔషధ యుక్తమవుతుంది. ఆ నీటిని పంట పొలాలకు, గ్రామ ప్రజలు ఆ నీటిని వాడటం వల్ల మేలు జరగుతుంది. వుడే. ఆధ్యాత్మికతతో సంపూర్ణ ఆరోగ్యం.