
AGARWOOD CHETLA PEMPAKAM
by S.K.M.PASHA
₹250
In stock · 82 available
PublisherS.K.M.PASHA
LanguageTelugu
మా సంస్థ నుండి గతంలో వెలువడిన "సామాన్యుల ఇంట సిరులు కురిపించే శ్రీగంధం సాగు" అనే గ్రంథం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందడంతో బాటు ఎందరో ప్రముఖులు, పాఠకులతో బాటు మన తెలుగు రాష్ట్రాలలోని కొన్ని వేల రైతు కుటుంబాలు శ్రీగంధం సాగు చేసుకోవడానికి ఒక దిక్సూచిగా, కరదీపికగా మరియు సహాయకారిగా ఉపయోగపడిందనే శుభవార్త విని ఎంతో సంతోషించాం. ఎందుకంటే అంతరించిపోతున్న విలువైన అడవి జాతి వృక్షాలను కాపాడుకోవటంతో బాటు వాటిని ప్రతి ఇంటా సాగుచేయించి సాగు చేసినవారిని ఆర్ధికంగా అభివృద్ధి చేయాలనీ, తద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా సాకారం కావాలనే మా ఆశయం వైపు వడివడిగా అడుగులు పడుతున్నందుకు మా ప్రయత్నం సఫలం అవుతున్నందుకు ఒకింత ఆనందంగా కూడా వుంది. గత సంవత్సర కాలంగా వివిధ సామాజిక మాధ్యమాలలో పత్రికలలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ, ఎక్కువగా వినబడుతున్న పేరు "అగర్వుడ్ సాగు". అనతికాలంలోనే కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ అగర్వుడ్ పంట అందిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నది పేద, చిన్న, సన్నకారు రైతులు, ఈ "అగర్వుడ్ సాగు" గురించిన వివరాలు, ఎలాంటి అపోహలు, అతిశయోక్తులకు తావులేకుండా నిజానిజాలను ఒక పుస్తకం ద్వారా తెలియజేయమని ఎంతోమంది రైతులు, పాఠకులు, ఎందరో పుస్తక ప్రేమికులు మరియు ప్రభుత్వ పెద్దలు మా సంస్థను కోరడం జరిగింది. గతంలో శ్రీగంధం సాగు పట్ల మీరు అందించిన విలువైన సమాచారాన్ని మేము విశ్వసిస్తున్నాము. అలాగే అగర్వుడ్ సాగు పట్ల మీరు పరిశోధన చేసి మన తెలుగు రాష్ట్రాలలో ఈ సాగును చేపట్టవచ్చని మీ సంస్థ ద్వారా తెలియజేస్తే మేము నిరభ్యంతరంగా అగర్వుడ్ సాగు చేపడతాం అనీ, మీ పయొనీర్స్ సంస్థ మీద, ఈ సంస్థ నిర్వాహకుల మీద మాకు ఎంతో నమ్మకం వుందని, మీరయితేనే ఈ అగరుడ్ సాగు మీద అధీకృతమైన సమాచారం యివ్వగలరనీ, అందువల్ల అగరుడ్ సాగు మీద కూడా అన్ని వివరాలతో కూడిన గ్రంథం వెలువరిస్తే బాగుంటుందనీ మమ్మల్ని కోరడం జరిగింది.