
AGNIPATHAM - ABDUL KALAM ATMAKATHA - 120.00
by ARUN TIWARI
₹120
In stock · 5 available
PublisherALAKANANDA PRACHURANALU
LanguageTelugu
ISBN9788182940154
అబ్దుల్ కలాం ఆత్మకథ అసాధారణమైనది. తమిళనాడు మారుమూలలోని పుణ్యక్షేత్రం రామేశ్వరంలో చదువుసంధ్యలకు అవకాశంలేని అతిసాధారణ కుటుంబంలో జన్మించిన కలాం దేశంలో రోదసీ పరిశోధనారంగానికి, క్షిపణుల అభివృద్ధికి సారధ్యం వహించే అత్యున్నత స్థాయికి ఎదిగారు. అసమాన శాస్త్రవేత్తగా, శాస్త్రజ్ఞులకే నాయకుడుగా, మార్గదర్శకుడుగా విఖ్యాతులయ్యారు. మొక్కవోని ధైర్యసాహసాలకు, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ అగ్నిపథం ఒక అసామాన్యవ్యక్తి ఆత్మకథ మాత్రమే కాదు. విజ్ఞాన-సాంకేతిక రంగాలలో స్వావలంబనకోసం స్వతంత్ర భారతదేశం సాగించిన నిరుపమాన కృషికి, సాధనకు, శోధనకు అక్షరరూపం. ఉత్తేజభరితమైన 'వింగ్స్ ఆఫ్ ఫైర్'ను ముఖ్యంగా పిల్లలకోసం సరళమైన భాషలో సంక్షిప్తంచేసి అగ్నిపథంగా అందిస్తున్నాం..