AKBAR - BIRBAL KATHALU - PILLALA BOMMALA by SWATHI BOOK HOUSE Telugu book cover

AKBAR - BIRBAL KATHALU - PILLALA BOMMALA

by SWATHI BOOK HOUSE

₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812140
నక్షత్రాలు - ఆవాలు అక్బర్, బీర్బల్ మధ్య స్నేహం లోక ప్రసిద్ధి. అక్బర్ ఆస్థానంలో ఉన్న కవులకు, పండితులకు, కళాకారులకు బీర్బల్ సుపరిచితం. అక్బర్ బీర్బల్తో అత్యంత సన్నిహితంగా వుండేవాడు. వీరిద్దరూ కలిసి గంటలకొద్దీ కాలక్షేపం చేస్తూ వుండేవారు. వాళ్ళిద్దరి మధ్య ఎన్నెన్నో హాస్య సంభాషణలు జరిగాయి. వాటిలో మచ్చుకు కొన్ని : ఒకసారి అక్బర్ తన అంతఃపురంలో పచార్లు చేస్తూ ఆకాశంలో వున్న నక్షత్రాల వైపు చూశాడు. వెంటనే ఆయనకొక చిలిపి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు తనలో తనే నవ్వుకున్నాడు. ఆ తరువాత రోజు అక్బర్ యథావిధిగా ఆస్థానంలో అడుగుపెట్టాడు. ఆస్థానంలో అందరూ ఎవరి స్థానాలలో వాళ్ళు ఆసీనులయ్యారు. అక్బర్ ప్రక్కనే వున్న ఆసనంలో బీర్బల్ కూర్చున్నాడు. అక్బర్ తనకు అంతకు ముందు రోజు వచ్చిన ఆలోచనను గుర్తు చేసుకొని దాన్ని సభలోని వారితో చెప్పాడు. "ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి ఖచ్చితమయిన సంఖ్య నాకు చెప్పిన వాళ్ళకు నేను వేయి బంగారు నాణాలు ఇవ్వాలనుకుంటున్నాను. అందుకోసం పదిహేను రోజుల వ్యవధి తీసుకోవచ్చు”, అని ప్రకటించాడు అక్బర్. అక్బర్-బీర్బల్