
AKUPACHANI MUGGU
₹100
In stock · 3 available
PublisherSUFI PRACHURANALU
LanguageTelugu
AKUPACCHANI MUGGU a short story by Vempalle Shareef నిజమే, ఒక సమాజంలో అనేక సమూహాలు కలిసి బతుకుతున్నప్పుడు ఒక సమూహం యొక్క సంస్కృతి ప్రభావం మరో సమూహంపై కచ్చితంగా ఉండి తీరుతుంది - మరి ఇన్ని విషయాలు తెలిసి కూడా అక్క పాత్ర ఆడపిల్లలు పుట్టినందుకు మాత్రం బాధపడాల్సి వస్తుంది. ఆకుపచ్చ ముగ్గు కథలో వివిధ సందర్భాల్లోని మాటలు అక్కపట్ల కథకుడి సహానుభూతి నుంచి, వ్యధ నుంచి, ఘర్షణ నుంచి పుట్టినట్టు మనం గమనిస్తాం. అక్క వేసే ఆకుపచ్చ ముగ్గు లయగా ఇంట్లో రంజాన్రోజు ప్రాణం పోసుకున్నా కట్టుబాట్లలో ఇంట్లో అంతరాలు మనల్ని వెంటాడి వేధిస్తాయి. కేతు విశ్వనాథరెడ్డి, కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత, కడప. 'ఆకుపచ్చ ముగ్గు' కథలో విశ్వజనీనత ఉంది. చిన్నచిన్న మాటల్లో ఘాటైన సందేశం ఉంది. ఈ కథలోని అక్క పాత్ర తెనాలి రామలింగకవి కావ్యంలోని నిగమశర్మ అక్క పాత్రను గుర్తుకు తెస్తుంది. నిగమశర్మ అక్క అనేక అంశాలపై ఉద్బోధలు చేస్తుంది. కానీఈ కథలో అక్క పాత్ర సందేశసారాన్ని జీవితంలోకి ఇంకించుకుని మసలుతుంది. సాదాసీదా జీవితంలో కొండంత అవగాహన చూపుతుంది. ఆనం దాలు, చిన్నచిన్న సంతోషాలు మతాలకు, కులాలకు అతీతమని నమ్మడమే కాదు అందరూ నమ్మేలా ప్రవర్తిస్తుంది. ఈ కథ ఒకటికి పదిసార్లు చదివి ఉంటాను. ఎందుకో ఈ కథ దాటి ముందుకెళ్లాలంటే మనసొప్పదు. సాయిబ్రహ్మానందం గొర్తి, కథారచయిత, అమెరికా. సూఫీ ప్రచురణలు