
AKUPACHHANI DESAM NALLA MIRIYAM CHETTU
₹300
In stock · 14 available
PublisherPRABHAVA PUBLICATIONS
LanguageTelugu
ఆకుపచ్చని దేశం నిశ్శబ్దపు సాయంకాలం, మౌనంగా తలలూపుతున్న చెట్లు. చెట్ల ఆకులు సన్నని జోల పాటల్లాంటి సడి చేస్తున్నాయి. ఘాటైన పరి మళాన్ని వెదజల్లే పూవులు, కబుర్లు చెప్పుకుంటున్న పిట్టలు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోకి వేగంగా నడిచివెళుతున్నాడు వీర. ప్రత్యేకమైన రూపం. చూడగానే హైదరాబాద్ మనిషి కాదనే విషయం అర్ధమవుతుంది. లోపలికి వస్తూనే అన్నివైపులకు ఆశ్చర్యంగా చూశాడు. కొద్ది నెలలలోనే ఎంత మార్పు. ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచమే దర్శనమిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ క్యాంపస్కున్న ప్రత్యేకత అదే. సత్యాన్వేషణ చేస్తున్న పురాయుగపు యోగిలా ప్రాచీనతను, ఆధునికతను రెంటినీ దర్శనీయం చేస్తుంది. అయితే ఈరోజు మాత్రం, భవనాల కంటే ఎత్తుగా ఎదిగినట్లు, శిఖరాగ్రంపై నిలబడి, ఈ భవన ప్రపంచాన్ని తన పాదం కింద అణిచిపెడుతున్నట్లుగా, ఎంతో ఎత్తుకు ఎదిగిన వామనుడిలా ఈ వీర (వీర నరసింహం). మెత్తటి పచ్చిక... పక్కకు ఒరిగినట్లు ఉండే ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్... మనుషుల దయకు, పోషణకు నోచుకొని అశోక వృక్షాలు... చెట్ల పొదల మధ్యన రాతిబల్లలు... క్యాంపస్ లో చిన్న చిన్న సమూహాలు... ఎన్నో యేళు గా మూలనపడి ఉన్న పాతకాలపు జీపు, దాని చక్రమొకటి ఊడి వచ్చి భూమి మధ్యలో తలను పాతుకున్నట్లుగా... ఈ సన్నివేశమంతా ఒక చివరి దృశ్యానికి కావలసిన వాతావరణసూచికలా ఉంది అనుకున్నాడు వీర. బహుశా యిది చివరి సందర్శన కావచ్చును. సిద్ధాంత వ్యాసం సమర్పించటం, వైవా పూర్తికావడం, మరింక యూనివర్సిరీటీతో చుట్టుకొన్న పేగు తెగిపోయినట్లే అనుకున్నాడు. క్యాంపస్ మధ్యలో నిలబడి సమస్త మానవ, మానవేతర సమూహా లకు మౌనంగా గుడ్ బై చెబుతున్నాడు. పచ్చిక, ఒంటరి అశోకవృక్షాలు, ఎన్నాళ్లుగానో కదలని జీపు, వీటన్నింటికి ఏదో ఒకరోజు ప్రాణం వస్తుందని అతని గాఢమైన నమ్మకం.