
ALALU KAVI TALAPOTHALU
₹125
In stock · 50 available
PublisherNIJAM PRACHURANALU
LanguageTelugu
అనల అలలు 2020 జూన్ నుంచి సంవత్సరాంతం వరకు ఎగసిన భావ సాగర కెరటాలు. కరోనా, ఆకస్మిక లాక్డౌన్ - వలస కార్మికుల నెత్తుటి పాద ముద్రలు, పై నుంచి దొర్లించిన జల పర్వతాలను తలపించిన వర్ష ఘాతానికి భీతిల్లిన నగర జీవుల అశ్రు వానలు, నిరవధిక ముట్టడితో ఢిల్లీ సింహాసనానికి ఏ చలి కాలంలోనూ ఎరుగనంత చలి పుట్టిస్తున్న మెతుకు మేరువుల ఆందోళన వంటి సందర్భాలు కావ్య వస్తువులుగా అక్షర ఉలులు చెక్కిన ఆర్ద్ర శిల్పాలతో బాటు ఎద కన్నులలో వొదిగిన పలు ప్రత్యేక సన్నివేశాల సృజన పతాకాలు ఇవి. బాధిత జన కవచమే నిజం' కలం. సౌందర్య దృష్టి, చమత్కార సృష్టి కవి సహజాలే. దాదాపు 50 ఏళ్ల క్రితం తెచ్చిన నిజం గీతాలు', ఎర్ర మందారాలు' తర్వాత గత మూడేళ్లలో వచ్చిన నివురు', నాలుగో పాదం' కవితల సంకలనాలు పాఠకుల, విమర్శకుల ఆదరణను చవిచూశాయి. ఎండా కాలపు తొలి ఉదయాన మొదలైన ప్రకృతి భావధార జన బాధల నిప్పుల కాలువల్లోంచి అక్షర నౌకాయానం చేసి ప్రతి రోజూ పదికి అటుఇటుగా ప్రభవించిన పొట్టి గీతాలు రెండు వేల దరిదాపులకు చేరగా వాటిని వడకట్టి కూర్చినవే ఈ అనల అలతులు అలలు. స్వేచ్ఛ, సోషలిజం, స్త్రీ పురుష సమానత్వం - మతోన్మాద ఉక్కు పద ఘట్టనలను, నిరంకుశాధికారాన్ని నిలదీసే రాజీలేనితత్వం, మనిషికి పాఠాలు నేర్పే ప్రకృతి అధ్యాపకత్వం వగైరా అంశాలపై అంకుశాల వంటి మృదుపద వ్యంగ్య గాంభీర్యాలు. అప్పటికప్పుడు అనిపించి కవితల రూపెత్తిన సాంద్రభావాల మంద్ర స్వరాలు, చరణ క్రమశిక్షణ పాటించని ఊహల విహారాలు ఫేస్బుక్ తీరాన్ని ముద్దాడగా రూపు దిద్దుకున్న సామాజిక కవ్వాలు, భవ్యబావుటాలు.