ALAYA JIRNODDHARANA - MAHAKUMBHABHISHEKAM by DR.EMANI SIVANAGIREDDY STHAPATI Telugu book cover

ALAYA JIRNODDHARANA - MAHAKUMBHABHISHEKAM

by DR.EMANI SIVANAGIREDDY STHAPATI

₹200
In stock · 5 available
PublisherSTHAPATYAVEDA RESEARCH FOUNDATION
LanguageTelugu
ISBN9788199379831
మనవి మాటలు తెలుగునేలపై ఆలయాలను సా.శ. 1 నుంచి 18వ శతాబ్ది వరకు తొలుత ఇటుకలతోనూ, తరువాత కొండలను తొలచి గుహలుగానూ, ఆ తరువాత పూర్తిగా రాళ్లతోనూ, అటు తరువాత కప్పు వరకూ రాళ్లు, పైన విమాన, గోపుర శిఖరాలు ఇటుక, సున్నంతోనూ నిర్మించి, సున్నపు బొమ్మలతో అలంకరించారు. వివిధ సామగ్రితో నిర్మించిన ఆలయాలు కాలక్రమంలో వివిధ కారణాల వల్ల శిథిలమై, విగ్రహాలు భిన్నమై, జీర్ణోద్ధరణకు దారి తీశాయి. ఆచార్యులు, అనుభవజ్ఞులైన శిల్పుల ఆధ్వర్యంలో ఆలయాలు అనేకసార్లు జీర్ణోద్ధరణ గావించ బడినాయి. ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అందుకోసం శిల్పాగమ శాస్త్రాల్లో చెప్పబడిన జీర్ణోద్ధారణ: విధి, విధానాలను ఇప్పటి శిల్పులకు తెలియ జెప్పటమే ఈ పుస్తక ముఖ్య ఉద్దేశం. ఆలయశైలి, ప్రాచీనతకు భంగం కలుగకుండా జీర్ణోద్ధరణ చేపట్టడానికి ఈ పుస్తకం చదివ్వెగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ రచనలో తగు సూచనలనందించిన శ్రీ కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్యకు, సంప్రదించిన గ్రంథ, వ్యాస రచయితలందరికీ కృతజ్ఞతలు. ఈ గ్రంథానికి చక్కటి సందేశాన్నిచ్చిన మాన్య కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖామాత్యులు శ్రీ జి.కిషన్రెడ్డి గారికి మా గౌరవపూర్వక ధన్యవాదాలు.