ALAYAMULU AGAMAMULU-300 by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

ALAYAMULU AGAMAMULU-300

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹300
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
అనుగ్రహభాషణం దేవాలయం - మానవ సంఘ జీవన ఔన్నత్యానికి మూర్తిమత్వము. దేవాలయం అనే ఆలోచన మన ఋషులు ఎలా ఊహించారో! దర్శించారో! దేవాలయం హిందూ ధర్మానికి హిమాలయశిఖరం - అంత ఎత్తైనది. దేవాలయం హిందూధర్మానికి హిందూ మహాసాగరం - అంతలోతైనది. దేవాలయం హిందూ సమాజానికి హైమవతియే! దేవాలయం హిందూ సమాజపు విశ్వవిద్యాలయం. ఏక్షణాన్నైనా, ఏకారణం చేతనైనా విడిపోవటానికి సవాలక్ష కారణాలు కల్గివున్న హిందూ సమాజాన్ని కలిపి వుంచింది కేవలం దేవాలయం మాత్రమే. అనంతపద్మనాభ స్వామి దేవాలయంలాంటి దేవాలయాలు - అసంఖ్యాకంగా వుండినవి. దేవుడిచ్చే వాటి కోసం జీవించే జాతి కాదు - దేవుడికే ఇచ్చుకోవటానికి ఇచ్చకల్గినది హిందూజాతి. దేవాలయం అంటే కేవలం 'అర్చన'లకు పరిమితమైన వ్యవస్థ కాదు. హైందవ భూతవర్తమాన భవిష్య'త్తులకు అనుసంధాన కేంద్రం. ప్రాచీన కాలంలో ఈ నేలపై పుట్టి వికసించి నిరూపమాన అసంఖ్యాక శాస్త్రాలకు కళలకు కాణాచి ఈ దేవాలయం. సగటు హిందువు ఐహిక ఆముష్మిక తృష్ణను తీర్చినది దేవాలయం. ప్రకృతి - పరమేశ్వరులను, నేల నింగి, నదులు పర్వతాలు, జడ- చేతనాలు, వదీ సముద్రతీరాలు. అన్నింటి వైశిష్ట్యాన్ని గుర్తించి - సమాజానికి చేరువ చేసి - తీర్థాలను క్షేత్రాలను - అద్భుతమైన దేవాలయాలుగా మార్చి మనకు అందించిన మన పూర్వీకులకు మనం ఎప్పటికీ ఋణగ్రస్థులమే. 'దేవాలయం' అంటే వెంటనే గుర్తుకు వచ్చేది దేవాలయం, కొన్ని ఇళ్ళు, కొన్ని చెట్లు, తీర్చినట్లు వున్న వీధులు, ఎత్తైన గోపురం, పక్షులు ఇది మన మనోఫలకం మీద ప్రత్యక్షమయ్యే దృశ్యం. ప్రత్యక్షంగా గ్రామంలోనే నివసిస్తూ వుంటే? ... గోపురం నుండి పక్షుల కిలకిల రావాలు, మంగళవాద్యముల శబ్దములు, అర్చకుల ఉచ్ఛస్వర మంత్రోచ్ఛారణలు, భక్తుల భజన కీర్తనల ఆలాపనలు, ఆవరణంలో ఆటలాడుకొంటున్న పిల్లల కేరింతలు ఇవి కంటికి కన్పించే దృశ్యం. దేవాలయం అంటే ఇంతేనా? మనకు వినిపించే, కనిపించే, అనిపించే విషయాలేనా ఇంకా ఏమైనావున్నాయా? అన్ని ప్రశ్నించుకొంటే- అందుకు సమాధానం చాలా చాలా వున్నాయనేది సమాధానం. అందుకే ఈ పుస్తక సాక్షాత్కారం.