
AMERIKULASA KATHALU KAMAMEESHULU
₹100
In stock · 7 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
నా చిన్న మాట... ఎప్పటిలాగానే ఈ పుస్తకంలో కూడా ఉన్నవి కొన్ని కథలు - అంటే కాస్త వాస్తవం, మరి కాస్త అవాస్తవాలూ కలబోసి వ్రాసినవి, మరికొన్ని ఆయా సందర్భాలని బట్టి వ్రాసిన కమామీషులు.. అంటే వ్యాసాల లాంటివి అన్నమాట. ఎప్పటిలాగానే ఇవన్నీ మా కాంతి & కిరణ్ ప్రభ పదేళ్ళకి పైగా నిర్వహిస్తున్న జాలపత్రిక కౌముది.నెట్లో గత రెండున్నర సంవత్సరాలలో నెలకి ఒకటి చొప్పున ప్రచురించబడినవే. అప్పుడప్పుడు వచ్చే అరా, కొరా స్పందనలనిబట్టి వాటికి పాఠకుల దగ్గర నుండి అఖండమైన ఆదరణ లభించింది ఓచ్ అని భుజాలు ఎగరేసుకోవచ్చును కానీ, నిజానిజాలు పాఠకులకే ఎరుక. ఎందుకంటే చదివిన వారిలో ఒక శాతానికి మాత్రమే ఓ మంచి మాటో, కోతి మాటో వ్రాసి కామెంట్ పెడతారు అని ఎక్కడో చదివాను. అలాగే "నేను క్రిందటిసారి వేసిన 500 పుస్తకాలు నెల రోజులలో అమ్ముడయిపోయాయి" అని కూడా చెప్పుకోడం కద్దు. కానీ నిజం ఏమిటంటే చాలామంది రచయితలు- నాతో సహా... ఎంతో శ్రమపడి, కనీసం 250 మందికి పంచి పెట్టగా, మిగిలినవి ఇంటి గరాజ్లోనో, అటక మీదో భద్రంగా ఉన్నాయీ అని అర్థం. ఇక మీ పుస్తకాలు అప్పనంగా పుచ్చుకుని, అమ్మకానికి పెట్టిన పుస్తకాల దుకాణాలు వారు "మీ పుస్తకాలు అమ్ముడయి పోయాయి. మరికొన్ని పంపించండి" అని అడిగితే ఇక్కడ "అన్నీ” అంటే ఐదు అనీ, 'మరికొన్ని' అన్నా ఐదు అనే అర్ధం. ఇదంతా ఎందుకు చెప్తున్నానూ అంటే నాది ఖర్మ సిద్ధాంతం. పుస్తకం వెయ్యడం మాత్రం మన పూర్వజన్మల కర్మఫలం. ఆ తరవాత ఆ పుస్తకం ఒక్కొక్కటీ ఎక్కడికి పోతుందో అది దాని ఖర్మ. చాలామంది కూడా ఈ సిద్ధాంతాన్నే నమ్ముతారు అని నా అనుమానం. ఈ సిద్ధాంతాన్ని పాటిస్తూ ఇదే ధోరణిలోనే ఇప్పటి వరకూ నేను వ్రాసిన 'అమెరికామెడీ కథలు', 'అమెరికాలక్షేపం', 'అమెరికామెడీ కబుర్లు', 'అమెరికాకమ్మ కథలు', 'అమెరికా అపహాస్య నాటికలు', 'అమెరికామెడీ నాటికలు', '116 అమెరికామెడీ కథలు', 'అమెరికలకలం కథలు', 'అమెరికట్టుకథలూ' పుస్తకాలుగా